ఇటీవల ఒక చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది అదేంటంటే ఓ అమెరికన్ మహిళ (American woman) కారులో ప్రయాణిస్తూనే 4.5 కిలోల (4.5 kg)బరువున్న బాలుడికి జన్మనిచ్చింది.ఆ సమయంలో ఆమె భర్త కారు నడుపుతున్నాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో, గర్భవతి మహిళ ప్రయాణీకుల సీటులో కూర్చుని, బలమైన ప్రసవ వేదనలతో అరవడం చూడవచ్చు.ఆమె తన భర్తను సీట్ బెల్ట్ తీయమని అడుగుతుంది.కొన్ని క్షణాల్లోనే, ఆమె స్వయంగా బిడ్డను ప్రసవించి, కేరుమని ఏడుస్తున్న బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంటుంది.భర్త నడుపుతూనే ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధిస్తున్నాడు.
ఆ మహిళ ఎమోషన్స్ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.తన బిడ్డను చేతిలో పట్టుకుని, “అతను కారులోనే బయటకు వచ్చాడు! ఓ మై గాడ్.నువ్వు చాలా అందంగా ఉన్నావు! ఓ మై గుడ్నెస్! నేను ఏం చేయాలి?” అని ఆశ్చర్యంతో అంటుంది.భర్త, ఫిల్మ్(Husband, Film) చేస్తూనే నడుపుతూ, “అతన్ని కొట్టు.
అతను అరుస్తున్నాడు అంటే, అతను ఊపిరి పీల్చుతున్నాడు.అతన్ని తలకిందులుగా పట్టుకో, బేబీ.అతన్ని తలకిందులుగా పట్టుకుని బట్టలు తీయి.” అని అన్నాడు.ఆమె మళ్లీ ఏం చేయాలో అని అడిగినప్పుడు, అతను మృదువుగా, “అతన్ని ప్రేమించు” అని సమాధానం ఇస్తాడు.
ఈ దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఈ బిడ్డ వారి మూడవ సంతానం.ఈ తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబం చూపించిన ధైర్యం, ప్రశాంతత ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది.
ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్న తర్వాత ఈ వీడియో వైరల్‌గా మారింది.చాలామంది ఈ అద్భుతమైన క్షణంపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.ఒక యూజర్ ఈ బిడ్డను “యంగెస్ట్ చైల్డ్ టు ట్రావెల్ ఇన్ ఏ కార్” అని ఫన్నీగా పిలిచారు.మరొకరు తల్లి ధైర్యాన్ని అభినందించారు.“10 పౌండ్ల బిడ్డను కారులోనే ప్రసవించడం అంటే ఎంత గొప్ప ధైర్యం” అని వారు అన్నారు.మరికొందరు తల్లి, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.ఒక వ్యక్తి భర్త ప్రశాంతంగా ఉండటాన్ని ప్రశంసించారు.“నా స్థానంలో ఉంటే నేను పిచ్చివాడిని అయ్యేవాడిని” అని ఆ వ్యక్తి అన్నారు.