ఈ ట్రైన్ స్టేషన్‌లో రీల్స్‌ తీయగలిగితే రూ.1.5 లక్షలు మీ సొంతం..

షార్ట్ ఫిల్మ్‌లు, రీల్స్(Short films, reels) చేయడం మీకు ఇష్టమా? అయితే ఇప్పుడు మీకు ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది! నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) నిర్వహిస్తున్న నమో భారత్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ పోటీలో పాల్గొని మీ ప్రతిభను ప్రదర్శించవచ్చు.కళాశాల విద్యార్థులు, స్వతంత్ర చిత్ర నిర్మాతలు, కంటెంట్ క్రియేటర్లు ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు.

 If You Can Pick Up The Reels At This Train Station, You Will Get Rs. 1.5 Lakhs.,-TeluguStop.com

మోడర్న్ నమో భారత్ ట్రైన్, రిజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) స్టేషన్లను కేంద్రంగా చేసుకుని మీకు నచ్చిన విధంగా ఒక షార్ట్ ఫిల్మ్ లేదా రీల్ ప్రిపేర్ చేయాలి.మీ కథ ఏదైనా కావచ్చు, మీరు ఎంత క్రియేటివ్‌గా అయినా ఉండవచ్చు.

కానీ మీ ఫిల్మ్‌లో రైలు లేదా స్టేషన్ కచ్చితంగా కనిపించాలి.

అత్యంత ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే, RRTS స్టేషన్లు, నమో భారత్ రైళ్లలో(RRTS stations,Namo Bharat trains)మీరు ఉచితంగా షూట్ చేయవచ్చు.

ఈ స్టేషన్లు, రైళ్లు చాలా ఆధునికంగా, అందంగా ఉంటాయి.అంటే, మీరు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అద్భుతమైన వీడియోలు తీయవచ్చు.

Telugu Creative, Platm, Ncrtc, Prize, Short-Latest News - Telugu

మీ ఫిల్మ్‌ను హిందీ లేదా ఇంగ్లీషులో సమర్పించాలి.సబ్ టైటిల్స్ అవసరం లేదు.అన్ని ఫిల్మ్‌లు కనీసం 1080p రిజల్యూషన్‌తో MP4 లేదా MOV ఫార్మాట్‌లో ఉండాలి.సబ్మిషన్‌కు చివరి తేదీ 2024, డిసెంబర్ 20.ఈ పోటీలో పాల్గొనాలనుకుంటే, మీ పేరు, మీ షార్ట్ స్టోరీ సమ్మరీ (100 పదాలలోపు), మీ ఫిల్మ్ ఎన్ని నిమిషాల పొడవు ఉంటుందో తెలియజేస్తూ, [email protected] అనే ఈమెయిల్ చిరునామాకు “అప్లికేషన్ ఫర్ నమో Bharat షార్ట్ ఫిల్మ్ మేకింగ్ కాంపిటీషన్” అనే సబ్జెక్ట్‌తో ఒక ఈమెయిల్ పంపాలి.

Telugu Creative, Platm, Ncrtc, Prize, Short-Latest News - Telugu

బహుమతుల విషయానికి వస్తే, మొదటి బహుమతి రూ.1,50,000, రెండవ బహుమతి రూ.1,00,000,మూడవ బహుమతి రూ.50,000 అంతేకాకుండా, గెలిచిన చిత్రాలు NCRTC డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రదర్శించబడతాయి.ఇది మీకు మంచి గుర్తింపును తెస్తుంది.మరిన్ని వివరాల కోసం లేదా మీ చిత్రాన్ని సమర్పించడానికి, NCRTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా [email protected] అనే ఈమెయిల్ చిరునామాకు మెయిల్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube