వరుస పర్యటనతో పవన్ బిజీ బిజీ .. నేడు ఉత్తరాంధ్రకు 

జనసేన అధినేత , ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు.ఒక పైపు పరిపాలనపై దృష్టి పెడుతూనే , రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 Deputy Cm Pawan Kalyan Uttarandhra Tour Today Details, Pawan Kalyan, Janasena, J-TeluguStop.com

కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జనసేన ఉండడం , తనకు అన్ని విషయాల్లోనూ టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ప్రాధాన్యం ఇస్తుండడంతో ,  పవన్ దానిని బాగానే ఉపయోగించుకుంటున్నారు.ఇక జిల్లాలో పర్యటనల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

  ఇదిలా ఉంటే నేడు ఉత్తరాంధ్ర పర్యటనకు( Uttarandhra Tour ) పవన్ ఈరోజు వెళ్లనున్నారు.  నేడు పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు .ఈ జిల్లాలోని సాలూరులో పవన్ పర్యటన ఉండబోతోంది .

Telugu Ap Diputy Cm, Ap, Deputycm, Jana Senani, Janasena, Pawan Kalyan, Road, Tr

ఈరోజు ఉదయం 9:30 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాలూరుకు పవన్ వెళతారు .అక్కడ సాలూరు డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన వేదిక  వద్దకు చేరుకుని నాయకులతో పవన్ మాట్లాడుతారు.ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మక్కువ మండలం బాబు జోల గ్రామానికి పవన్ చేరుకుంటారు.

  అక్కడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు .ఆ తరువాత గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు అంతకుముందు అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా తిలకించనున్నారు. 

Telugu Ap Diputy Cm, Ap, Deputycm, Jana Senani, Janasena, Pawan Kalyan, Road, Tr

ఈరోజు సాయంత్రానికి మళ్లీ విశాఖపట్నం కి( Vishakapatnam ) పవన్ చేరుకుంటారు.  గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితులపై అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించి వాటికి సంబంధించిన పరిష్కారాల పైన ప్రధానంగా చర్చించనున్నారు.అలాగే ఈ నెల 21వ తేదీన కూడా ఉత్తరాంధ్రలోనే పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికారకు వర్గాల ద్వారా తెలుస్తోంది.ఎక్కువగా జిల్లాలు,  నియోజకవర్గాల వారిగా పర్యటించేందుకు,  ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపేందుకు పవన్ ఎక్కువ ఆసక్తి చూపిస్తుండడం పై ప్రజల్లోనూ,  జనసేన వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది.

పవన్ పర్యటనల ద్వారా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం అవుతుందని,  జనసేన( Janasena ) గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube