అధ్యక్ష పీఠం రక్షణ కవచం .. ఆ కేసు నుంచి ట్రంప్‌ తప్పించుకున్నట్లేనా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )విజయం సాధించడంతో అగ్రరాజ్య రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.అన్నింటికి మించి ట్రంప్‌పై ఉన్న పలు కేసుల విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

 Hush Money Case Proceedings Paused Days After Trump's Victory , Donald Trump , T-TeluguStop.com

ప్రెసిడెంట్ ఇమ్యునిటీతో ఆయనకు కొన్నాళ్ల పాటు కేసులు, విచారణ నుంచి రక్షణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన తొలిసారి ట్రంప్ ముగ్గురు రైట్ వింగ్ న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు నియమించారు.

రెండోసారి అధ్యక్షుడు కావడంతో ఈసారి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.అబార్షన్ హక్కులపై కీలక తీర్పు వెలువరించిన జస్టిస్ క్లారెన్స్ థామస్( Justice Clarence Thomas ) (76), శామ్యూల్ అలిటో ( Samuel Alito )(74)లు సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు.

వీరు కనుక పదవీ విరమణ చేస్తే వారి స్థానంలో మరో ఇద్దరిని ట్రంప్ నామినేట్ చేసే అవకాశాలు లేకపోలేదు.

Telugu Donald Trump, Hushdays, Clarence Thomas, Porn, Samuel Alito, Supreme, Tru

2026 మధ్యంతర ఎన్నికల నాటికి రిపబ్లికన్లు సెనేట్‌పై నియంత్రణను కోల్పోయే లోగా థామస్, అలిటోల స్థానంలో ట్రంప్ కొత్తవారిని నియమించవచ్చని చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవెన్ ష్విన్ అభిప్రాయపడ్డారు.అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు( Supreme Court ) అధ్యక్షుడి చేత నియమించబడతారు.కానీ సెనేట్ ఈ నియామకాన్ని ఖరారు చేయాల్సి ఉంటుంది.

Telugu Donald Trump, Hushdays, Clarence Thomas, Porn, Samuel Alito, Supreme, Tru

ఇక ట్రంప్‌పై ఉన్న కేసుల విషయానికి వస్తే.పోర్న్ స్టార్‌కు ( porn star )డబ్బు చెల్లించిన విషయాన్ని కప్పిపుచ్చడంతో పాటు బిజినెస్ రికార్డులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారన్న అభియోగాలపై ట్రంప్‌‌ను ఈ ఏడాది జూలైలో న్యాయస్థానం దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.అయితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి డొనాల్డ్ ట్రంప్‌కు ఇమ్యునిటీ లభిస్తుందని ష్విన్ అన్నారు.అలాగే 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర పన్నినట్లుగా మరో అభియోగం కూడా ట్రంప్‌పై ఉంది.

ఈ కేసు సుప్రీంకోర్టు వద్దకు చేరుకోగా.ధర్మాసనంపై రిపబ్లికన్లు 6-3 మెజారిటీలో ఉన్నందున ట్రంప్‌కు ఇక్కడా రక్షణ లభిస్తుందని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube