నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.రహదారిపై ప్రయాణాలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ కొంతమంది మాత్రం ఏమవుతుందిలే అనే తేలిక భావంతో దూసుకెళ్తున్నారు.
ఇటీవల ఒక మోటార్‌సైకిలిస్ట్( Motorcyclist ) ఇలాంటి తప్పే చేశాడు.ఆల్టోనా సమీపంలోని మెల్బోర్న్లోని ప్రిన్సెస్ ఫ్రీవేపై( Princess Freeway ) అతడు దూసుకెళ్తూ చివరికి ప్రమాదానికి గురైయ్యాడు.
అక్టోబరు 8న, మోటారు మోటార్‌సైకిలిస్ట్ భారీ ట్రాఫిక్‌ను దాటుకుంటూ వెళ్లాడు.డాష్‌క్యామ్ ఫుటేజీలో మోటార్‌సైకిలిస్ట్ కార్ల మధ్య అతివేగంతో పోవడం కనిపించింది.
అకస్మాత్తుగా, ఒక బ్లాక్ SUV లేన్లను మార్చింది, రైడర్ దానిపైకి దూసుకెళ్లాడు.
ఈ దృశ్యాలు సమీపంలోని డాష్‌క్యామ్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది.డాష్‌క్యామ్ ఓనర్స్ ఆస్ట్రేలియా( Dash Cam Owners Australia ) అనే ఫేస్బుక్ పేజీ దీనిని షేర్ చేసింది.ఈ ఫుటేజ్ ఆ యాక్సిడెంట్ ను( Accident ) చూపిస్తోంది.
మోటర్‌సైకిలిస్ట్ తన వాహనాన్ని అదుపు చేయలేకపోవడంతో ఒక ఎస్యూవీ కారును ఢీకొన్నాడు.ఫలితంగా మోటర్‌సైకిలిస్ట్ ఎస్యూవీ కారు పైభాగానికి ఎగిరిపడి, అక్కడే కొద్ది సేపు ఉండిపోయాడు.
ఈ ప్రమాదానికి కారణం, మరొక కారు లైన్ మార్చేందుకు ప్రయత్నిస్తుండటం, దాన్నుంచి మోటర్‌సైకిలిస్ట్ తప్పించుకోవడానికి ప్రయత్నించడం అని పోలీసు అధికారులు తెలిపారు.
రెండు వాహనాలు ఢీకొన్న తర్వాత రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా వెళ్లాయి.ఎస్యూవీ కారు ఆగిపోయింది.కారు డ్రైవర్ చాలా కోపంగా కనిపించాడు.
మోటర్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని చూసి కేకలు వేసి చేతులతో సంకేతాలు ఇచ్చాడు.బైక్ రైడర్ రోడ్డు పక్కన నిలబడి షాక్ నుంచి కోలుకుంటున్నట్లు కనిపించాడు.
ఈ ప్రమాదాన్ని చూసిన మరొక మోటర్‌సైకిలిస్ట్ ఆగి ఆయనకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.విక్టోరియా పోలీసులు ఈ సంఘటన గురించి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
https://www.facebook.com/share/v/18niz6wNoJ/ దీనిపై క్లిక్ చేసి వీడియోను చూడవచ్చు.