జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP Deputy CM Pawan Kalyan ) ఏపీ ప్రభుత్వము తేలుతున్న వ్యవహరిస్తూ దూకుడు పెంచుతున్నారు గతంతో పోలిస్తే పవన్ పొలిటికల్ గ్రాఫ్ పెరిగింది.పవన్ కు ఇతర రాష్ట్రాల్లోనూ క్రేజ్ ఉన్న నేపథ్యంలో బిజెపి పవన్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని రాజకీయంగా తమకు కలిసి వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
దీనిలో భాగంగానే మహారాష్ట్ర పర్యటనకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.రెండు రోజులపాటు మహారాష్ట్రలోనే పవన్ పర్యటించనున్నారు .ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పవన్ అక్కడికి వెళ్తన్నారు.ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం నిర్వహిస్తారు.
ఈనెల 16 , 17 తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పవన్ స్వయంగా పాల్గొంటారు.మరట్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్ లలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
ఈ మేరకు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇప్పటికే ఖరారు అయ్యింది.రెండు రోజుల పర్యటనలో భాగంగా ఐదు బహిరంగ సభల్లో , రెండు రోడ్డు షోలలో పవన్ పాల్గొంటారు.
మొదటి రోజు మరెట్లాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

16వ తేదీ ఉదయం నాందేడ్ జిల్లా దెగ్లూర్ నియోజకవర్గంలో( Deglur Constituency ) నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు .ఆ తర్వాత అదే జిల్లాలో బోకర్ నియోజకవర్గానికి వెళ్తారు.అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు.
మధ్యాహ్నం రెండు గంటలకు లాతూర్ చేరుకుంటారు.అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని అదే రోజు రాత్రి 6 గంటలకు సోలాపూర్ లో రోడ్ షో లో( Road show in Solapur ) పాల్గొంటారు.
నవంబర్ 17న విధర్భ ప్రాంతానికి వెళ్తారు.

ఆరోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు.సాయంత్రం పూణె కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు .ఆ తర్వాత కస్పాపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.