సోషల్ మీడియా కార్యకర్తల కోసం రంగంలోకి జగన్ .. వీరికే ఆ బాధ్యతలు 

ప్రస్తుతం ఏపీలో వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలే టార్గెట్ గా ఏపీ ప్రభుత్వం చర్యలకు దిగడం, గతంలో వైసిపి (YCP)అధికారంలో ఉన్న సమయంలోను, టిడిపి ఓటమి చెంది అధికారంలోకి వచ్చిన తరువాత సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, మహిళల పైన, వైసిపి వ్యతిరేక పార్టీల నాయకులను టార్గెట్ చేసుకుని వైసిపి కి చెందిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్తులు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వం చర్యలకు దిగింది.  ఇప్పటికే ఎంతోమందిని అరెస్టు చేసింది .

 Jagan Entered The Field For Social Media Activists.. Those Are The Responsibilit-TeluguStop.com

ఇంకా అనేక మందిని అరెస్టు చేసినందుకు రంగం సిద్ధం చేస్తుంది.ఈ క్రమంలో వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్ట్(YCP social media activist) లు తీవ్ర భయాందోళనలో ఉన్న నేపథ్యంలో పార్టీ తరఫున వారికి అండగా నిలిచేందుకు వైసిపి అధినేత జగన్ (Jagan)రంగంలోకి దిగారు.

ఈ మేరకు వారికోసం అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.  ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గొంతు నులుముతున్నారని,  సోషల్ మీడియా కార్యకర్తలను భయభ్రాంతులకు కృషి చేస్తే ప్రశ్నించేవారు ఉండరని భావించి , అక్రమ కేసులు పెడుతున్నారని,  ఇప్పటికీ జగన్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే .ఇక సోషల్ మీడియా కార్యకర్తలకు ఎటువంటి అన్యాయం జరిగినా,  పార్టీ తరఫున అండగా ఉంటామని జగన్ ప్రకటించారు.  దీనికోసం కొన్ని ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.

  ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయాలని సూచించారు.  వారి తరఫున పోరాటం చేసేందుకు వైసిపి ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని జగన్ ప్రకటించారు.

ఈ క్రమంలోనే అక్రమ నిర్బంధాలు,  అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండాలనే ఆలోచనతో ప్రత్యేక బృందాలను జగన్ ఏర్పాటు చేశారు.అక్రమ నిర్బంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతోపాటు,  వారికి భరోసా ఇచ్చేందుకు వారిని పరామర్శిస్తూ ఆత్మ స్థైర్యాన్ని పెంచడానికి ఈ పార్టీ బృందాలు పనిచేస్తాయని జగన్ పేర్కొన్నారు .ఆయా జిల్లాలో పార్టీ నేతలు,  సంబంధిత నాయకులు, లీగల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ పార్టీ బృందాలు పనిచేస్తాయని తెలిపారు.జిల్లాల వారీగా ఈ మేరకు బృందాలను ప్రకటించారు.

Telugu Ap, Chandrababu, Ysrcp-Politics

శ్రీకాకుళం సిదిరి అప్పలరాజు ,శ్యాం ప్రసాద్

విజయనగరం బెల్లాని చంద్రశేఖర్ ,జోగారావు

విశాఖపట్నం భాగ్యలక్ష్మి,  కేకే రాజు

తూర్పుగోదావరి జక్కంపూడి రాజా ,వంగా గీత,

పశ్చిమగోదావరి కె సునీల్ కుమార్ యాదవ్, జయప్రకాష్ (జె పి ,)

కృష్ణ :  మొండితోక అరుణ్ (ఎమ్మెల్సీ ), దేవ భక్తుని చక్రవర్తి,

Telugu Ap, Chandrababu, Ysrcp-Politics

గుంటూరు విడదల రజిని డైమండ్ బాబు

ప్రకాశం టీజేఆర్ సుధాకర్ బాబు వెంకటరమణారెడ్డి

నెల్లూరు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పి చంద్రశేఖర్ రెడ్డి ,( ఎమ్మెల్సీ )

చిత్తూరు గురుమూర్తి (ఎంపి), చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

అనంతపురం : కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, రమేష్ గౌడ్,

కడప : సురేష్ బాబు, రమేష్ యాదవ్

కర్నూలు : హఫీజ్ ఖాన్ , సురేందర్ రెడ్డి ( ఆలూరు ) లను నియమించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube