ఇదేందయ్యా ఇది.. బావిలో నీరు కోసం వెళ్తే పెట్రోల్ వస్తోంది

సాధారణంగా మనం బావిళ్లలో నుంచి నీళ్లు వస్తాయనే సంగతి అందరికీ తెలిసిన విషయమే.కానీ, తాజాగా ఒక బావిలో నుంచి నీళ్లకు బదులు పెట్రోల్ రావడం అందర్నీ ఆశ్చర్యాని కలుగ చేస్తుంది.

 This Is It.. If You Go For Water In The Well, Petrol Is Coming, Petrol, Well, Wa-TeluguStop.com

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.ఛత్తీస్‌గఢ్‌ లోని దంతెవాడ జిల్లాలో గత రెండు రోజులుగా ఒక వార్త వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఒక ఇంట్లో ఉన్న బావిలో నీళ్లకు బదులు పెట్రోల్ వస్తుంది.ఈ విషయం తెలుసుకున్న ఊరు ప్రజలు అందరూ ఆ బావి వద్దకు చేరుకోవడంతో చివరికి అది పోలీసుల వరకు చేరింది.

పోలీసులు విచారణ అనంతరం వెలుగు లోకి వచ్చిన విషయం తెలుసుకొని పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేసేసారు.ఈ సంఘటన గీడం ప్రాంతానికి సంబంధించింది.

రెండు రోజుల క్రితం ఉదయం సమయంలో కుటుంబ సభ్యులు నీటి కోసం ప్రాంగణంలోని బావిలో బకెట్ వేసి బయటకు తీయగానే అతనికి నీరు చాలా వింతగా కనిపించింది.అంతేకాకుండా నీరు రంగు కూడా చాలా భిన్నంగా ఉందని గుర్తించి ఆ వ్యక్తి అది ఒక ఇంధనం లాగా ఉందని పరిశీలన చేయగా చివరకు అది నీరు కాదు పెట్రోలని తేలింది.

ఇలా బావిలో నుంచి పెట్రోల్ (Petrol)రావడం.విషయాన్ని పూరి ప్రజలకు తెలియడంతో వారు కూడా భారీ సంఖ్యలో ఆ ప్రజలు అక్కడికి చేరుకున్నారు.ఇంటిదగ్గర పెద్ద క్యూలైన్ లో కట్టడం మొదలుపెట్టేశారు.ఈ వార్త కాస్త వైరల్ అవ్వడంతో చివరికి పోలీసులు రంగంలోకి దిగి ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు.

ఈ విషయంపై విచారణ జరిపేందుకు వీలుగా ఆ ఇంటిని పోలీసులు సీల్ చేసేసారు.

Telugu Latest, Petrol, Well-Latest News - Telugu

గత కొన్ని రోజుల క్రితం పెట్రోల్ పంప్(Petrol) యజమాని ఒక కేసును రిజిస్టర్ చేశారని పోలీసులు తెలిపారు.అందులో భాగంగా బఫ్నా పెట్రోల్ పంపు యజమాని(Owner of Bafna Petrol Pump) తన స్థలంలో ప్రతి రోజు కూడా పెట్రోల్ ను దొంగత చేస్తున్నారని పోలీసులతో తెలిపాడు.పోలీసులు ఆ కేసును ఈ కేసుతో ముడిపెట్టి దర్యాప్తు మొదలుపెట్టారు.

సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా.ఎవరైనా ఆగాంతకులు పెట్రోల్ ను దొంగలించి ఈ బావిలో పోస్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేశారు.

కానీ, అది చివరికి తప్పని తేలింది.ఇక మరో కోణం విషయానికి వస్తే.

ఈ ఇంటికి 100 మీటర్ల దూరంలో ఒక పెట్రోల్ పంపు ట్యాంక్ ఉందని అక్కడ పెట్రోల్ పంపు ట్యాంక్ లీక్ అయిందని.దీంతో ఆ పెట్రోల్ భూమికి ఇంకిపోయి ఈ బావికి చేరిందని తెలిసింది.

ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదాలు సంఘటనలో జరగకుండా అగ్నిమాపక దళం పోలీసులు ఇంటి చుట్టూ రక్షణగా నిలిచారని పోలీసు అధికారులు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube