ప్రస్తుత రోజుల్లో మధుమేహం( diabetes ) అనేది చాలా కామన్ అయిపోయింది.వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మధుమేహం బారిన పడుతున్నారు క్లారిటీగా చెప్పాలంటే షుగర్ పేషెంట్ లేని ఇల్లే ఉండటం లేదు.
ఇక షుగర్ వ్యాధి రాకుండా ఎలాగో జాగ్రత్తలు తీసుకోరు.కనీసం వచ్చిన తర్వాత అయినా జాగ్రత్త పడండి.
షుగర్ లెవెల్స్ ను ఎల్లప్పుడు కంట్రోల్ లో ఉంచుకోండి.అందుకు సహాయపడే ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.
అయితే మధుమేహం ఉన్న వారికి అత్యంత మేలు చేసే ఆహారాల్లో బెండకాయ( okra ) ఒకటి.చక్కెర వ్యాధి ఉన్నవారు వారానికి రెండు సార్లు అయినా బెండకాయ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బెండకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది, అంటే అది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం అవ్వదు.అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ( Blood sugar levels )ను తగ్గించడంలో సహాయపడే ఫైటో కెమికల్స్ ను బెండకాయ కలిగి ఉంటుంది.

బెండకాయలు ఉండే పలు ఫ్లేవనాయిడ్‌లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో తోడ్పడతాయి.అంతేకాకుండా బెండకాయ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.బెండకాయ లో అధిక మొత్తంలో ఉండే ఫైబర్ కంటెంట్ మధుమేహాన్ని నిర్వహించడంలో హెల్ప్ చేస్తుంది.కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బెండకాయ బరువు తగ్గడానికి కూడా మద్దతు ఇస్తుంది.
కాబట్టి మధుమేహం ఉన్నవారు బెండకాయను తమ డైట్ లో చేర్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

పైగా బెండకాయలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది మరియు దృష్టి సంబంధిత వ్యాధులకు చెక్ పెడుతుంది.ఋతు చక్రాన్ని నియంత్రించడంలో మరియు హార్మోన్లను సమతుల్యం చేయడంలోనూ బెండకాయ సహాయపడుతుంది.అంతేకాకండోయ్.
బెండకాయలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.అందువల్ల బెండకాయను ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.
ఫలితంగా కీళ్ల నొప్పలకు దూరంగా ఉండొచ్చు.







