టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో శ్రియ( Shriya ) ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.తన సినీ కెరీర్ లో ఈ బ్యూటీ వివాదాలకు దూరంగా ఉంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగించారు.
గతంతో పోలిస్తే శ్రియకు క్రేజ్ తగ్గినా ఈ హీరోయిన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తక్కువేం కాదనే చెప్పాలి.షూటింగ్స్ కు దూరంగా ఉన్న సమయంలో ఈ బ్యూటీ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
తన కూతురిని పొలానికి తీసుకెళ్లిన శ్రియ కూతురికి వ్యవసాయం గురించి చూపించారు.అదే సమయంలో శ్రియ నూర్పిళ్లు ఎలా చేస్తారో చూపించి పొలం పనులు సైతం చేశారు.
వాస్తవానికి శ్రియ రేంజ్ కు ఈ పనులు చేయాల్సిన అవసరం లేదు.అయితే కూతురికి భారతీయ సాంస్కృతీ సాంప్రదాయాలను నేర్పించే దిశగా శ్రియ అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
శ్రియ తను చేసిన పనుల ద్వారా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.సాధారణంగా తల్లీదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి తమ పనులు తాము చూసుకుంటూ ఉంటారు.శ్రియ మాత్రం వాళ్లకు భిన్నంగా అడుగులు వేయడం ద్వారా గొప్పదనాన్ని చాటుకున్నారు.శ్రియ గొప్ప నటి మాత్రమే కాదని గొప్ప తల్లి కూడా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఆ సినిమాలో శ్రియ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.ఈ సినిమా సక్సెస్ సాధిస్తే శ్రియకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.శ్రియను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి శ్రియ ఇష్టపడతారు.శ్రియ వయస్సు పెరుగుతున్నా యంగ్ గానే కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.