ఈ ఐదు ప్ర‌శ్న‌ల్లో మూడింటికి మీరు స‌మాధానాలు చెబితే మీరు జీనియ‌స్ అన్న‌ట్లే లెక్క! ట్రై చేయండి!

గ‌ణితం, సైన్స్‌, సోష‌ల్‌.ఇలా స‌బ్జెక్టుకు చెందిన ప్ర‌శ్న‌లు అయితే ఎవ‌రైనా ఠ‌కీ ఠ‌కీమ‌ని ఇట్టే ఆన్స‌ర్లు చెప్పేస్తారు.

 If You Answer Three Of These Five Questions You Are Genius-TeluguStop.com

ఎందుకంటే అవి ఆ విష‌యానికి సంబంధించిన‌వి క‌దా.కానీ మెద‌డుకు మేత పెట్టే ప్ర‌శ్న‌లు వేస్తే మాత్రం సాధార‌ణంగా ఎవ‌రూ అంత ఈజీగా జ‌వాబు చెప్ప‌రు.

ఎందుకంటే వాటికి జ‌వాబులు అంత క్లిష్టత‌రంగా ఉంటాయి మ‌రి.ఇప్పుడు మేం కింద ఇచ్చింది కూడా స‌రిగ్గా ఇలాంటి ప్ర‌శ్న‌లే.

మొత్తం అవి 5 ఉన్నాయి.వీటిలో క‌నీసం 3 ప్ర‌శ్న‌ల‌కు అయినా మీరు స‌మాధానాల‌ను క‌రెక్ట్‌గా గెస్ చేయాలి.

అలా చేస్తే మీరు చాలా తెలివిగ‌ల వారు అన్న‌ట్లే లెక్క‌.మ‌రింకెందుకాల‌స్యం, ఆ ప్ర‌శ్న‌ల‌పై ఓ లుక్కేయండి మ‌రి.!

1.ఐస్ టీ


ఇద్దరమ్మాయిలు ఒక చోట కూర్చుని డిన్నర్ చేస్తున్నారు.ఇద్దరూ ఐస్ టీ ఆర్డర్ చేశారు.ఒకమ్మాయి గ్లాసు తీసుకుని వేగంగా తాగేసింది.ఇంకొక అమ్మాయి గ్లాసు మామూలుగా తాగింది.అనుకోకుండా రెండవ అమ్మాయే చనిపోయింది.

వేగంగా తాగిన అమ్మాయి బ్రతికే ఉంది.ఎందుకు ?

2.భార్యా భ‌ర్త‌


ఒకావిడ తన భర్తని ముందు కాల్చింది.త‌రువాత‌ అయిదు నిముషాల పాటు నీళ్లలో ముంచింది.

కాసేపు అయ్యాక ఇద్దరూ బయటికి పార్టీకి నవ్వుకుంటూ వెళ్లారు.ఇది ఎలా సాధ్యమ‌వుతుంది ?

3.ఆత్మ‌హ‌త్య‌


ఒక వ్యక్తి రోడ్డు పై చనిపోయి ఉన్నాడు.అతని ఒక చేతిలో గన్‌ ఉంది, మరొక చేతిలో క్యాసెట్టు ఉంది.

పోలీసులు వచ్చి అతని దగ్గర ఉన్న క్యాసెట్టుని తీసుకుని, దాన్ని ఆన్ చేసి ప్లే చేశారు.అందులో.ఇక నేను బతకాలని అనుకోవడం లేదు.అని అతను అన్న మాటలు ఉన్నాయి.

కానీ పోలీసులు మాత్రం అతనిది హత్యే అని నిర్ధారించారు.ఎలా ?

4.హ‌త్య


ఒక ఊరిలో అత్యంత ధనవంతుడు ఆదివారం రోజున హత్య కావించబడ్డాడు.అతని ఇంటికి వచ్చిన పోలీసులు భార్యని సమాచారం అడగగా, ఆ సమయంలో ఎవరెవరు ఏమి చేస్తున్నారు అని అడగ్గా, భార్య తాను నిద్రపోతున్నా అని చెప్పింది, వంట వాడు వంటగదిలో ఉన్నానని చెప్పాడు, పని మనిషి ఉత్తరం తీసుకువచ్చింది, తోటమాలి కూరగాయలు తీసుకుంటున్నాడు.

పోలీసులు హంతకుడిని పట్టుకున్నారు, ఎలా ?

5.పేపర్ బాయ్‌


రోజూ ఒక ఇంటికి పేపర్ వేసే ఒకతను ఒక రోజున తాను చూసిన ఒక మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు వెళ్లి చూడగా అక్కడ మూడు రోజుల క్రిందటి పత్రిక , అప్పటి కూరగాయలు కనిపించాయి.పోలీసులు వెంటనే మొదటి అనుమానితుడిగా పేపర్ బాయ్ ని అరెస్ట్ చేశారు.ఎందుకు ? స‌మాధానాలు…

3.చనిపోయిన వ్యక్తి ఎప్పుడూ, తనను తాను కాల్చుకునే ముందు టేప్ రివైండ్ చేసుకోడు.
2.కాల్చడం అంటే ఆంగ్లంలో షూటింగ్ అని అర్థం వ‌స్తుంది.షూటింగ్ అంటే ఫొటో షూట్ చేసింది.
1.నెమ్మ‌దిగా తాగిన అమ్మాయి గ్లాసులో విషం క‌ల‌ప‌బ‌డింది.
4.ఆదివారం రోజున ఉత్తరాల‌ను పోస్ట్ మ్యాన్లు ఇవ్వ‌రు.
5.రెండు రోజులపాటు న్యూస్ పేపర్ వెయ్యలేదు అంటే ఆ ఇంట్లో పేపర్ వేసేవాడికి అతను చనిపోయాడని తెలిస్తేనే వేసి ఉండడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube