దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా కూడా మహిళలపై అఘాయిత్యాలు అనేది చాలా కామన్ అయ్యింది.ఆడవారిపై అఘాయిత్యాలు అంతకంతకు పెరుగుతున్నాయి.
ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది.చిన్న పిల్లలపై కామాంధులు రాక్షసుల మాదిరిగా పడిపోతున్నారు.
చిన్న పిల్ల ముసలమ్మ అనే విషయాలను మరచిపోయి కామంతో కళ్లు మూసుకు పోయిన నరరూప రాక్షసులు అత్యంత దారుణంగా ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.అయితే అమెరికాతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాల్లో అబ్బాయిలపై కూడా రేప్‌లు అంటూ వార్తలు చదువుతూ ఉన్నాం.
అమెరికాలోని ఫ్లోరిడాలో 40 ఏళ్ల మహిళ తనకంటే 25 ఏళ్లు చిన్న కుర్రాడిపై అఘాయిత్యంకు పాల్పడింది.రెండు సంవత్సరాల్లో దాదాపుగా 20 సార్లు అతడిని రేప్ చేసినట్లుగా తెలుస్తోంది.
బాలుడిని రేప్ చేసిన ఆమె కవల పిల్లలకు తల్లి అయ్యింది.ఈ విషయం రెండు సంవత్సరాల తర్వాత బయటకు తెలియడంతో పోలీసు కేసు నమోదు అయ్యింది.
కోర్టు ఆమెకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లుగా సమాచారం అందుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఫ్లోరిడాలోని ఓర్నాల్డోలో 15 ఏళ్ల కుర్రాడిని భయపెట్టి 40 ఏళ్ల టర్నర్ అనే మహిళ అతడిని లోబర్చుకుంది.తన కోరిక తీర్చకుంటే నీ అన్నయ్య జాబ్ పోగొడతాను అంటూ బెదిరించింది.దంతో ఆ కుర్రాడు ఏం చేయాలో పాలుపోక రెండేళ్ల పాటు ఆమె చెప్పినట్లుగా చేయాల్సి వచ్చింది.రెండేళ్లలో దాదాపు 20 సార్లు అతడిని బలవంతం చేసిందట.ఈ విషయం టర్నర్ స్నేహితుడి ద్వారా బయటకు తెలిసింది.ఆ కుర్రాడి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గట్టిగా అడగడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
కుర్రాడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టర్నర్‌ను అరెస్ట్ చేశారు.అతడి ఇష్టపూర్తిగానే కలిశామని నేనేం అతడిని భయపెట్టడం కాని, బలవంత పెట్టడం కాని చేయలేదు అంటూ టర్నర్ చెప్పుకొచ్చింది.
టర్నర్‌కు పుట్టిన కవల పిల్లల డీఎన్‌ఏ టెస్టు చేయగా ఆ బాలుడికి పుట్టిన పిల్లలే అంటూ తేలిపోయింది.ఆ బాలుడి ఇష్టానుసారంగా చేసినా కూడా 18 ఏళ్లు నిండని కుర్రాడితో శృంగారం అనేది అమెరికా చట్ట ప్రకారం నేరం.
అందుకే టర్నర్‌కు కఠిన శిక్ష విధించే అవకాశం.
.