గత ఏడు నెలల నుండి ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు వ్యాక్సిన్ ను కనుగొనడానికి అనేక దేశ సైంటిస్టులు అహర్నిశలు పని చేస్తున్నారు.
అయితే తాజాగా రష్యా దేశం మాత్రమే ఇప్పటి వరకు అధికారికంగా వ్యాక్సిన్ ను విడుదల చేసింది.ఇకపోతే వ్యాక్సిన్ ఇప్పట్లో మనదేశానికి వచ్చేలా కనబడట్లేదు.
కాబట్టి వీలైనంత వరకు భారతదేశంలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ జీవనం కొనసాగించడం చాలా మంచిది.
ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లి పనులు చేయాలన్న నేపథ్యంలో కచ్చితంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం.
ఇందుకోసం ఆస్పత్రుల చుట్టూ, మెడికల్ స్టోర్ ల చుట్టూ తిరిగే దానికంటే ఇంట్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని రోగ నిరోధకశక్తిని పెంచుకుంటే సరిపోతుంది.ఇక ఈ విషయం పరంగా ఆలోచిస్తే… మన ఇంట్లో ఉండే వెల్లుల్లి, అల్లం మరి కొన్ని కూరగాయల ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుకోవచ్చు.
ఇక ముఖ్యంగా వెల్లుల్లి తీసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లను శరీరం లోకి ఎక్కువగా పొందవచ్చు.అంతే కాదు వీటి వలన ఏదైనా వ్యాధికి సంబంధించిన క్యాన్సర్లు మీద ఏ సమస్యలు ఉన్నా ఎదుర్కోగలవు.
ఇక అల్లం తీసుకోవడం ద్వారా కూడా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కొద్దిమేర పెంచుకోవచ్చును.వీటి ద్వారా ముఖ్యంగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు జబ్బులు వాటి బారిన పడకుండా ఇది అద్భుతంగా పని చేయగలదు.
ఇక అలాగే మనకు విరివిగా దొరికే క్యాబేజీలలో ఇమ్యూనిటీ పెంచే గుణాలు చాలానే ఉన్నాయి.ఇందులో గ్లుటమైన్ అనే పదార్థం బాగా లభిస్తుంది.
అలాగే ఆకుకూరలు, పాలకూర తీసుకోవడం ద్వారా మన శరీరానికి పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది.అంతేకాదు విటమిన్ సి, అలాగే కొన్ని యాక్సిడెంట్స్ కూడా పాలకూర ద్వారా లభిస్తాయి.
ఇలా కొన్ని పదార్థాలు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ డి ఎక్కువగా దొరికే ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం శరీరానికి ప్రస్తుత కాలంలో చాలా అవసరం.
మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత యాక్టివ్ గా ఉండగలం.ఒకవేళ ఎవరైనా కరోనా వైరస్ సోకిన దాని నుండి త్వరగా కోలుకోవచ్చు.