ప్రార్ధనా స్థలాల వద్ద నిరసనలపై నిషేధం .. కెనడాలోని రెండు సిటీ కౌన్సిల్స్‌ తీర్మానం

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఖలిస్తాన్ వేర్పాటువాదుల దూకుడు నేపథ్యంలో కెనడాలో పరిస్ధితులు నానాటికీ దిగజారిపోతున్నాయి.ఇటీవల బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌పై( Hindu Sabha Mandir ) ఖలిస్తాన్ సానుభూతిపరుల దాడితో కెనడా ఉలిక్కిపడింది.

 Two Towns In Canada Pass Motions Prohibiting Protests In The Vicinity Of Places-TeluguStop.com

హిందువులు సహా ఇతర మతస్తులు తాజా ఘటనలతో బిక్కుబిక్కుమంటున్నారు.భద్రతా కారణాలతో కెనడాలో భారతీయ కాన్సులేట్‌లు నిర్వహించాలని అనుకున్న కాన్సులర్ క్యాంప్‌లు కూడా రద్దయ్యాయి.

జీటీఏ ఏరియాలోని రెండు ప్రధాన దేవాలయాలైన బ్రాంప్టన్ త్రివేణి మందిర్ , మిస్సిసాగాలోని టొరంటో కాలీ బారిలలో భద్రతా చర్యలపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.దీంతో ఈ వారాంతంలో షెడ్యూల్ చేయబడిన కాన్సులర్ క్యాంపులను రద్దు చేస్తున్నట్లు టొరంటోలోని భారతీయ కాన్సులేట్ ప్రకటించింది.

Telugu Canada, Dipika Damerla, Greatertoronto, Khalistan, Worship-Telugu NRI

ఈ నేపథ్యంలో గ్రేటర్ టొరంటో ఏరియా (జీటీఏ)లోని( Greater Toronto Area ) రెండు పట్టణాలు ప్రార్థనా స్థలాల పరిసరాల్లో ర్యాలీలు, నిరసనలు నిషేధిస్తూ తీర్మానం చేశాయి.మొదట మిస్సిసాగా సిటీ కౌన్సిల్( Mississauga City Council ) ఒక మోషన్ ఆమోదించింది.ఈ తీర్మానాన్ని తెలుగు మూలాలున్న దీపికా దామెర్ల( Dipika Damerla ) ప్రవేశపెట్టగా , కౌన్సిల్‌లోని పది మంది సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేశారు.కనీసం ఏ ఒక్కరూ కూడా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించకపోవడం గమనార్హం.

Telugu Canada, Dipika Damerla, Greatertoronto, Khalistan, Worship-Telugu NRI

తన తీర్మానానికి ఆమోదం లభించిన విషయాన్ని దీప్తి ఎక్స్‌లో పంచుకున్నారు.ఇకపై కౌన్సిల్ పరిధిలోని అన్ని ప్రార్థనా స్థలాల ముందు నిరసనలను నిషేధించేలా ఈ తీర్మానం సిబ్బందికి అధికారాన్ని ఇస్తుందని తెలిపారు.ప్రార్థనా స్థలాలకు 100 మీటర్ల పరిధిలో ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని దీప్తి వెల్లడించారు.ప్రార్ధనా స్థలాల వద్ద ఇలాంటి నిరసనలు శాంతియుతంగా జరిగినా.లోపలికి వెళ్లాలనుకునే వారు భయపడే అవకాశాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ తీర్మానానికి తాము సంపూర్ణ మద్ధతు తెలుపుతున్నట్లు కెనడియన్ హిందూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కుషాగర్ శర్మ తెలిపారు.

ప్రతి ఒక్కరూ శాంతియుతంగా వారి మత విశ్వాసాలను అనుసరించడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.బ్రాంప్టన్ సిటీ కౌన్సిల్ కూడా ఇదే తరహా తీర్మానానికి ఆమోదం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube