వీడియో: అట్లాంటిక్ మహాసముద్రంలో రాకాసి గాలి.. క్రూయిజ్ షిప్ దాదాపు పడిపోయింది..!!

మహాసముద్రంలో భారీ అలలు వస్తుంటాయి.ప్రచండ గాలులు కూడా వీస్తుంటాయి.

 Video: Rakasi Gali Cruise Ship Almost Capsized In Atlantic Ocean..!!, Explorer O-TeluguStop.com

ఈ గాలులు పెద్ద పెద్ద నౌకలను కూడా ఊపేస్తాయి.కొన్నిసార్లు ఈ నౌకలు ఈ గాలి తాకిడికి తట్టుకోలేక తలకిందుల అవుతుంటాయి.

తాజాగా రాయల్ కరేబియన్(Royal Caribbean) సంస్థకు చెందిన “ఎక్స్‌ప్లోరర్ ఆఫ్ ది సీస్‌”(Explorer of the Seas) నౌక ఇలాంటి గాలిలోనే చిక్కుకు పోయింది.ఇది బార్సిలోనా నుంచి మయామికి ప్రయాణిస్తున్న సమయంలో తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది.

దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.నౌక స్పెయిన్‌లోని కాస్టిలియన్ తీరాన్ని వదిలి వెళ్లిన కొద్దిసేపటికే ఈ ఇబ్బందులు మొదలయ్యాయి.

క్రూయిజ్ (cruise) మ్యాపర్‌ ప్రకారం, నౌక స్పెయిన్‌కు(Spain) చెందిన కానరీ దీవులలో (Canary Islands)అతిపెద్దదైన టెనెరిఫ్ దగ్గర ఉన్నప్పుడు అకస్మాత్తుగా భారీ గాలి వీచింది.ఈ బలమైన గాలి కారణంగా నౌక ఒక్కసారిగా కదలిపోయిందని రాయల్ కరేబియన్ తెలిపింది.నౌకలో పరిస్థితులు క్షణాల్లోనే ఎంత తీవ్రంగా మారిపోయాయంటే ప్రయాణికులు షిప్ లో నిలబడడానికి కూడా అల్లాడిపోయారు.నౌక ఒక్కసారిగా వంగిపోవడంతో క్యాసినోలోని టేబుళ్లు తిరగబడిపోయాయి.బార్‌షెల్ఫ్‌ మీద నుంచి బాటిళ్లు కింద పడ్డాయి.ప్రజలు భద్రత కోసం అక్కడిక్కడికి పరుగులు తీయడంతో నేల అంతా వస్తువులు చెల్లాచెదురుగా పడి పోయాయి.

కొద్ది సమయంలోనే గాలి వేగం గంటకు 46 మైళ్ల నుంచి 86 మైళ్లకు చేరుకోవడంతో పరిస్థితి మరింత భయానకంగా మారిందని ఒక ప్రయాణికుడు తెలిపారు.

జోనాథన్ పారిష్(Jonathan Parish) అనే ప్రయాణికుడు, ఆ క్షణం ఎంత భయంకరంగా ఉందో వివరిస్తూ, కొన్ని నిమిషాల పాటు అందరూ భయంతో అయోమయంగా ఉండిపోయామని చెప్పారు.అయితే, అకస్మాత్తుగా వీచిన ఈ బలమైన గాలి గురించి కెప్టెన్ ప్రకటించడంతో అందరికీ కొంత ధైర్యం వచ్చింది.ఈ సంఘటన తర్వాత, అందరి ప్రయాణికులను తమ క్యాబిన్లకు తిరిగి వెళ్లమని కోరారు.

క్రూ సభ్యులు (Crew Members)అందరినీ లెక్కించి, వారి భద్రతను సరిచూశారు.అయితే ఈ ఘటనలో ఒక ప్యాసింజర్‌కి గాయాలయ్యాయి.

అతడికి వైద్యం కోసం షిప్పును ఒక దగ్గర ఆపాల్సి వచ్చింది.ఈ నౌక 1020 అడుగుల పొడవు ఉంటుంది ఇందులో ఒకేసారి 4,290 ప్రయాణికులు ప్రయాణించవచ్చు.1,185 వర్కర్స్‌కు కూడా ఇందులో ప్లేస్ ఉంటుంది.వినోదాన్ని అందించే అన్ని యాక్టివిటీస్ ఇందులో ఆఫర్ చేశారు.

ఇది 20 ఏళ్లుగా మహాసముద్రాలపై ప్రయాణాలు చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube