లడ్డూ కోసం బూందీ తయారు చేస్తున్న జర్మన్ యువతి.. అవాక్కవుతున్న నెటిజన్లు..

ఈరోజుల్లో చాలా మంది విదేశీయులు ఇండియన్ పాపులర్ ఫుడ్స్ తయారు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.వారి ఫుడ్ ప్రిపరేషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 A Young German Girl Making Boondi For Laddoos.. Netizens Are Surprised.., Jennif-TeluguStop.com

తాజాగా ఇలాంటి మరొక వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో జర్మనీకి(Germany) చెందిన జెన్నిఫర్(Jennifer) అనే మహిళ బయటే బూందీలను తయారు చేయడం కనిపిస్తోంది.

@jennijigermany అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో భారతీయ సంస్కృతికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసే జెన్నిఫర్ ఈ వీడియోతో మరోసారి అందరిని ఆకట్టుకుంది.

ఈ వీడియోలో జెన్నిఫర్ లడ్డూలకు ముఖ్య పదార్థమైన బూందీలను తయారు చేయడంలో పాల్గొంటున్న దృశ్యం కనిపించింది.

ఇతరులు కూడా ఆమెకు సహాయం చేస్తున్నారు.అప్పటికే సిద్ధంగా ఉన్న పసుపు రంగు శనగపిండి మిశ్రమాన్ని జెన్నిఫర్ ఒక చెంచాతో వేడి నూనెలో వేస్తుంది.

ఆ మిశ్రమం చిన్న చిన్న బూందీలుగా మారి, వేడి నూనెలో త్వరగా వేగి, బంగారు రంగులోకి మారుతుంది.

తాను 8 కిలోల పిండితో లడ్డూలు చేయడానికి బూందీలను తయారు చేస్తున్నట్లు జెన్నిఫర్ తన వీడియో క్యాప్షన్‌లో రాసుకున్నారు.అంతేకాకుండా, బయట వంట చేయడం వల్ల వచ్చే ఆనందం గురించి కూడా ఆమె పంచుకున్నారు.ఈ వీడియో చూసిన వారు జెన్నిఫర్ కృషిని అభినందించారు.

అంతేకాకుండా, వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ లో వినిపించిన లతా మంగేష్కర్ ‘లగ్ జా గలే’(Lata Mangeshkar’s Lag Ja Gale’) పాట కూడా బాగుందని పొగిడారు.

జెన్నిఫర్ తయారు చేసిన బూందీల వీడియో సి చాలామంది అవాక్కయ్యారు.అచ్చం మన భారతీయ మహిళ లాగానే ఈ జర్మనీ యువతీ బూందీ తయారు చేయడం చూసి తమకాలను తామే నమ్మలేకపోయారు.“వావ్, చాలా బాగుంది, ఇది నీకు ఎలా తెలిసింది, మేం ఇంకా నేర్చుకోలేదు, చాలా బాగా చేశావు.వేరే వంటకాలను ప్రయత్నిస్తున్న నిన్ను చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది” అంటూ ప్రశంసలు కురిపించారు.మరికొందరు “ఆమెకు వెంటనే భారతీయ పౌరసత్వం ఇచ్చేయండి” అని కూడా కామెంట్ చేశారు.“ఆహా బూందీ! ఈ వంటకం, దీంతో చేసే లడ్డూలు ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకుతాయి” అని కొందరు కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube