మనుషుల్లోనైనా, జంతువుల్లోలైన తల్లి స్వభావం ఒకేలా ఉంటుంది.మనుషులు మాత్రమే కాదు జంతువుల్లో కూడా తల్లులు తమ పిల్లల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమవుతాయి.
ఈ విషయాన్ని అవి ఎన్నోసార్లు నిరూపించాయి.తాజాగా తన పిల్లను రక్షించడానికి ఓ కోతి తల్లి (Mother monkey) చేసిన ఊహించని సాహసం చేసింది.
ఈ కోతులకు సంబంధించిన ఒక హార్ట్ టచింగ్ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.ఈ భావోద్వేగ క్షణం ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది.
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో “@garrywalia_” అనే ఖాతా ద్వారా పంచుకున్నారు.ఈ పోస్ట్‌లో, “తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొంటారు” అని రాశారు.
సాధారణంగా కోతులు బాగా అల్లరి చేస్తాయి.అదే చిన్నపిల్లలయితే వాటి అల్లరి మరింత ఎక్కువగా ఉంటుంది.ఈ వీడియోలో కనిపించిన కోతి పిల్ల (baby monkey)కూడా అల్లరి చేస్తూ హై టెన్షన్ కరెంటు వైర్లపైకి ఎక్కింది.ఆ తర్వాత స్టంట్స్ చేసింది కానీ చివరికి ఈ చిన్న కోతి పిల్ల, విద్యుత్ తీగలపై ఇరుక్కుపోయింది.
అందుకే భయపడుతూ ఉంది.అది తిరిగి సురక్షితమైన ప్రదేశానికి దూకలేకపోతుంది.
దాని తల్లి, దగ్గరలోని గోడపై కూర్చుని, చాలా ఆందోళన చెందుతూ, తన పిల్లను రక్షించడానికి ప్రయత్నిస్తోంది.తల్లి కోతి, తన పిల్లను ఎప్పుడు రక్షించాలి అని ఆలోచిస్తూ, ప్రతి క్షణం దానిని జాగ్రత్తగా గమనిస్తోంది.
గోడకు, విద్యుత్ తీగలకు మధ్య చాలా దూరం ఉండటం వల్ల, తల్లి కోతి తన పిల్లను రక్షించడానికి ప్రయత్నిస్తే, వారిద్దరికీ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
కొద్ది సేపటి తర్వాత, తల్లి కోతి ధైర్యంగా విద్యుత్ తీగలపైకి దూకి, తన పిల్లను గట్టిగా పట్టుకొని, గోడపైకి తీసుకెళ్లింది.సురక్షితంగా ఉందని తెలిసి, తల్లి కోతి తన పిల్లను గట్టిగా హత్తుకుని ఓదార్చింది.ఈ హార్ట్ టచింగ్ వీడియో లక్షలాది మందిని కదిలించింది.
తల్లి ప్రేమ ఎంత గొప్పదో, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్ని త్యాగాలు చేస్తారో ఈ వీడియో తెలియజేస్తోంది.
ఆ కోతి తల్లి వీడియోను 5,38,000 మందికి పైగా వ్యక్తులు చూశారు.ఈ వీడియో చూసిన వారు తమ భావోద్వేగాలను కామెంట్ల ద్వారా వ్యక్తం చేశారు.ఒక వ్యక్తి, “తన పిల్ల సంతోషంగా ఉండాలంటే ఏదైనా చేయడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉంటారు” అని రాస్తే, మరొకరు “తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఏ ప్రమాదాన్నైనా ఎదుర్కొంటారు” అని కామెంట్ చేశారు.మరికొందరు, “ఏ పరిస్థితుల్లోనైనా తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా ఉంటారు” అని పేర్కొన్నారు.“తల్లి ప్రేమకు సమానమైనది మరొకటి లేదు” అని కూడా కొందరు కామెంట్ చేశారు.కోతి తల్లి చేసిన ఈ ధైర్యవంతమైన పనిని చూసి చాలా మంది ప్రేరణ పొందుతున్నారు.