రాజాసాబ్ మూవీ స్థాయి వేరు.. నిర్మాత కామెంట్లతో రాజాసాబ్ స్థాయి పెరగనుందా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ప్రభాస్ చేతినిండా ప్రస్తుతం బోలెడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

 The Raja Saab Budget Details Out, Raja Saab, Rajasaab Budget, Tollywood, Prabhas-TeluguStop.com

ఇన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో రాణిస్తూ దూసుకుపోతున్నారు.ఆ సంగతి ఈ పక్కన పెడితే ప్రభాస్ ప్రస్తుతం మారుతి( Director Maruthi ) దర్శకత్వంలో రాజా సాబ్( Rajasaab ) అనే మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్, ప్లాప్ దర్శకుడు చిన్న దర్శకుడు అయిన మారుతితో సినిమా చేయబోతున్నాడు అనగానే ప్రతి ఒక్కరిలో టెన్షన్ మొదలైంది.

Telugu Maruthi, Prabhas, Vishwaprasad, Raja Saab, Rajasaab Budget, Rajasaab, Tol

రాజా సాబ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ తోనే ప్రభాస్ ఫ్యాన్స్ లోని భయాలను మారుతి పోగొట్టాడు.రాజా సాబ్ గ్లిమ్ప్స్ తో ఫ్యాన్స్ ని కూల్ చెయ్యడంలో మారుతి సక్సెస్ అయ్యాడు.అయితే రాజా సాబ్ చిన్న సినిమాగానే చాలామంది ట్రీట్ చేస్తున్నారు.

మీడియం బడ్జెట్ తోనే మారుతి తో ప్రభాస్ సినిమా చేస్తున్నారనుకుంటున్నారు.కానీ రాజా సాబ్ చిన్న చితక కథతో తెరకెక్కడం లేదు అని నిర్మాత మాటలు చూస్తే అర్ధమవుతోంది.

రాజా సాబ్ గురించి నేను చాలా తక్కువగానే చెప్పగలను.రాజా సాబ్ స్థాయి వేరు.

రెండేళ్ల ముందే మొదలైన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ని కల్కి విడుదలయ్యాకే పెద్ద షెడ్యూల్ చేశాము.రాజా సాబ్ స్టోరీ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది.

Telugu Maruthi, Prabhas, Vishwaprasad, Raja Saab, Rajasaab Budget, Rajasaab, Tol

సెట్స్, వీఎఫెక్స్ అన్నీ కూడా భారీగా ఉంటాయి.ఇదొక కామెడీ ఎంటర్టైనర్ అంటూ రాజా సాబ్ రేంజ్ ఏమిటో నిర్మాత విశ్వప్రసాద్( Producer Vishwaprasad ) మాటల్లో విన్నాక ప్రభాస్ ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ అయ్యింది.ఇక ఈ చిత్రం భారీగా అంటే 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టుగా నిర్మాత మాటల్లో అర్ధమవుతోంది.ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్లు కూడా విడుదల కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube