ఆ విషయంలో మహేష్ ను గౌతమ్ బీట్ చేస్తాడు.. అశోక్ గల్లా షాకింగ్ కామెంట్స్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) మేనల్లుడు అశోక్ గల్లా( Ashok Galla ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మరికొన్ని రోజుల్లో దేవకీ నందన వాసుదేవ( Devaki Nandana Vasudeva ) సినిమాతో ఈ హీరో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 Ashok Galla Shocking Comments About Gautam Details, Ashok Galla, Devaki Nandana-TeluguStop.com

నవంబర్ నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో అశోక్ మాట్లాడుతూ గౌతమ్( Gautam ) హైట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Ashok Galla, Ashokgalla, Devakinandana, Mahesh Babu-Movie

గౌతమ్ తో నేను ఎక్కువ సమయం స్పెండ్ చేయలేదని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మేము కలిశామని చెప్పుకొచ్చారు.నేను అమెరికా, సింగపూర్ లలో చదివే సమయంలో ఇండియాకు చాలా తక్కువ సందర్భాల్లో వచ్చేవాడినని సెలవుల సమయంలో ఫ్రెండ్స్ తో ఎక్కువగా ఉండేవాడినని పేర్కొన్నారు.గౌతమ్ కు, నాకు ఏజ్ గ్యాప్ ఎక్కువేనని అయితే మహేష్ మామ( Mahesh Babu ) ఇంటికి వెళ్లిన సమయంలో మాత్రం గౌతమ్ ను కలిసేవాడినని చెప్పుకొచ్చారు.

Telugu Ashok Galla, Ashokgalla, Devakinandana, Mahesh Babu-Movie

ప్రస్తుతం గౌతమ్ ను చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుందని ఏంటి ఇంత పెరిగాడు ఈ కుర్రాడు అని అనిపిస్తుందని అశోక్ గల్లా పేర్కొన్నారు.గౌతమ్ మహేష్ మామ హైట్ ను సైతం బీట్ చేస్తాడని అనిపిస్తోందని అశోక్ గల్లా చెప్పుకొచ్చారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా దేవకీ నందన వాసుదేవ మూవీ ట్రైలర్ విడుదల కావడం జరిగింది.

తాజాగా విడుదలైన ట్రైలర్ లో అశోక్ గల్లా లుక్స్ బాగున్నాయి.

పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా మానస వారణాసి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందించగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube