తెలుగు సీనియర్ నటి రోజా( Roja ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది రోజా.
ఆ తర్వాత రాజకీయ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా మినిస్టర్ గా కూడా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.అయితే సినిమాల పరంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ రాజకీయపరంగా మాత్రం ఆమె బోలెడంత నెగిటివిటీని మూటకట్టుకుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే ఇటీవలే ఆమె గురించి జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి( Kiraak RP ) మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

గతంలో కూడా చాలాసార్లు రోజాపై విరుచుకుపడిన విషయం తెలిసిందే.తాజాగా ఆర్పీ మాట్లాడుతూ.నేను రోజా మంత్రిగా ఉన్నపుడు చేసిన అవినీతిని ప్రశ్నిస్తుంటే, కొంత మంది రోజా నాకు జబర్దస్త్( Jabardasth ) పరంగా చాలా హెల్ప్ చేసిందని, నా వ్యాపారానికి కూడా ప్రమోటర్ గా వచ్చిందని, దీంతో నాకు విశ్వాసం లేదని అంటున్నారు.
తప్పు ఎవరు చేసినా ప్రశించడం నా నైజం.

గతంలో రోజా తన అన్నయ్య రామ్ ప్రసాద్ రెడ్డి( Ram Prasad Reddy ) తనని డబ్బు కోసం వేధిస్తున్నాడని, ఒకవేళ ఇవ్వకపోతే తనపై అసత్య ఆరోపణలు చేస్తానని బెదిరిస్తున్నాడని, 22 ఏళ్ళ సినీ కెరీర్ లో సంపాదించిందంతా తీసుకొని నన్ను నడి రోడ్ పై ఉంచాడని, చంపుతానని కూడా వార్నింగ్ లు ఇస్తున్నాడని 2013 అక్టోబర్ 6 న రోజా రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.

మరి చిన్నప్పట్నుంచి ఒకే చోట కలిసి పెరిగిన అన్నయ్యే డబ్బులు లాక్కొని చంపుతానని బెదిరిస్తున్నాడని కేసు పెట్టింది.అలా కేసు పెట్టడంలో తప్పు కూడా లేదు.తప్పు ఎక్కడుంటే అక్కడ నిలదీయాలి.మరి నేనేదో జబర్దస్త్ లో కలిసి చేసాం.నా బిజినెస్ ఓపెనింగ్ కూడా వచ్చిందని ఆమె అవితిని ప్రశ్నించకుండా ఉండాలా అని చెప్పుకొచ్చాడు ఆర్పీ.దీంతో సోషల్ మీడియాలో రోజాతో మద్దతుగా కామెంట్స్ చేసే వారికి గట్టిగా సమాధానం ఇచ్చినట్టు అయింది.