నా ప్రాణాలకు రక్షణ కల్పించండి.. కెనడా పోలీసులకు హిందూ ఆలయ అధిపతి లేఖ

కెనడాలో ఖలిస్తాన్(Khalistan ,Canada) వేర్పాటువాదుల కారణంగా కెనడాలో పరిస్ధితులు రోజురోజుకు దిగజారుతున్నాయి.ఇటీవల బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌పై దాడి చేసిన నేపథ్యంలో కెనడాలోని హిందువులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు .

 President Of Hindu Temple In Toronto Seeks Police Security, Khalistan ,canada, G-TeluguStop.com

తాజాగా గ్రేటర్ టొరంటో ఏరియా (జీటీఏ)(Greater Toronto Area (GTA))లోని ఓ దేవాలయానికి అధ్యక్షుడు .తన ప్రాణానికి ప్రమాదం ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరడం కలకలం రేపింది.

బ్రాంప్టన్‌‌లో ఉన్న భారత్ మాతా మందిర్ అధ్యక్షుడు జెఫ్ లాల్, పీల్ రీజినల్ పోలీస్ (పీఆర్‌‌పీ) (Jeff Lall, Peel Regional Police (PRP))చీఫ్ నిషాన్ దురైయప్పకు ఈ మేరకు లేఖ రాశారు.తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన అందులో పేర్కొన్నారు.

తన భద్రతతో పాటు కుటుంబం గురించి ఆందోళనగా ఉందని లాల్ (lol)ఆవేదన వ్యక్తం చేశారు.హిందూ సభ మందిర్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న తాను బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్‌కు ఫోన్ చేసి ఆలయాన్ని, భక్తులను రక్షించేందుకు బందోబస్తును కోరినట్లు లాల్ తెలిపారు.

Telugu Burlington, Canada, Greatertoronto, Jeff Lall, Khalistan-Telugu NRI

ఆ సమయంలో తాను ఓ వ్యాపార సమావేశం అనంతరం బర్లింగ్టన్(Burlington) పట్టణంలో ఉన్నానని.హింసాత్మక ఘటన తర్వాత ఆలయానికి చేరుకున్నట్లు వెల్లడించారు.లేఖపై పోలీస్ అధికారుల స్పందన కోసం తాను ఎదురుచూస్తున్నానని లాల్ తెలిపారు.సిక్కులపై దాడి చేయడానికి కత్తులను ఇచ్చిన లాల్‌ను అరెస్ట్ చేయాలని పిలుపునిస్తూ ఖలిస్తాన్ (Khalistan)వేర్పాటువాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) ఎక్స్‌లో అతని గురించి పోస్ట్ చేసింది.

Telugu Burlington, Canada, Greatertoronto, Jeff Lall, Khalistan-Telugu NRI

అలాగే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పోయిలీవ్రేకు(Pierre Poilivre) సన్నిహితుడిగా ఎస్‌ఎఫ్‌జే(SFJ) అభివర్ణించింది.హిందూ సభ మందిర్ వద్ద ఖలిస్తాన్ అనుకూల సిక్కులపై ప్రణాళికాబద్ధమైన దాడి ట్రూడోను బలహీనపరిచేందుకు పొయిలీవ్రేను బలోపేతం చేయడానికి భారత వ్యూహంలో ఒక భాగమా అని ఎస్ఎఫ్‌జే (SFJ)పోస్ట్ పేర్కొంది.లాల్ కన్జర్వేటివ్ పార్టీ నామినీ కాదని కెనడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.బ్రాంప్టన్ ఈస్ట్ స్వారీకి మరో అభ్యర్ధిగా నామినేషన్ వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఈ ఏడాది ప్రారంభంలో పార్టీని విడిచిపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube