టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలతో ఒకే హీరోయిన్ కలిసి నటించడం అరుదుగా జరుగుతుంది.అయితే కొంతమంది హీరోయిన్లు వయస్సుతో సంబంధం లేకుండా ముగ్గురు హీరోలతో కలిసి నటించి అరుదైన ఘనతలను సొంతం చేసుకుంటూ వార్తల్లో నిలిచారు.
ఇలా నందమూరి హీరోలైన బాలయ్య,( Balayya ) జూనియర్ ఎన్టీఆర్,( Jr NTR ) కళ్యాణ్ రామ్ లతో( Kalyan Ram ) కలిసి నటించిన ఇద్దరు హీరోయిన్ల పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ముందుగా ఈ జాబితాలో కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) పేరు చెప్పుకోవాలి.
బాలయ్య కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఎన్టీఆర్ కాజల్ కాంబోలొ బృందావనం, బాద్ షా, టెంపర్ సినిమాలు తెరకెక్కగా తారక్ పై అభిమానంతో జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేశారు.
కాజల్ అగర్వాల్ తన కెరీర్ లో చేసిన ఏకైక స్పెషల్ సాంగ్ ఈ సాంగ్ మాత్రమే కావడం గమనార్హం.
కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో లక్ష్మీ కళ్యాణం, ఎమ్మెల్యే సినిమాలు తెరకెక్కాయి.అయితే బాలయ్య, తారక్ లకు లక్కీ ఛార్మ్ అయిన కాజల్ కళ్యాణ్ రామ్ కు మాత్రం హిట్ ఇవ్వలేకపోయారు.మరో ప్రముఖ హీరోయిన్ ప్రియమణి( Priyamani ) బాలయ్యతో కలిసి మిత్రుడు సినిమాలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు.
కళ్యాణ్ రామ్ ప్రియమణి కాంబినేషన్ లో హరే రామ్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.తారక్ ప్రియమణి కాంబోలో యమదొంగ సినిమా( Yamadonga ) తెరకెక్కగా ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే సంగతి తెలిసిందే.