ఆవ నూనె( Mustard oil ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.చాలా మంది వంటల్లో ఆవ నూనెను ఉపయోగిస్తారు.
ఎందుకంటే మిగతా వంట నూనెలతో పోలిస్తే ఆవ నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఆవ నూనెలో లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది.
ఇది క్యాన్సర్( Cancer ) వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటుంది.ఆవ నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల మరియు వ్యాప్తికి అది అడ్డుకట్ట వేస్తుంది.
అలాగే పూర్వకాలం జలుబు, దగ్గు ( Cold, cough )వంటి సమస్యలకు ఆవ నూనెతో చెక్ పెట్టేవారు.అందుకోసం వాటర్ లో నాలుగు చుక్కలు ఆవనూనె వేసి ఆవిరి పట్టాలి.
ఇలా చేస్తే జలుబు, దగ్గు పరార్ అవుతాయి.ఒకవేళ కఫంతో ఇబ్బంది పడుతుంటే ఆవ నూనెలో రెండు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించాలి.
ఇప్పుడు ఈ ఆయిల్ గోరు వెచ్చగా అయిన తర్వాత ఛాతిపై అప్లై చేసుకుని మర్దన చేసుకుంటే కఫం కరుగుతుంది.

ఆవ నూనెలో సెలీనియం ( Selenium )మరియు మెగ్నీషియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.అలాగే ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కు ఆవ నూనె గొప్ప మూలం.
అందువల్ల రోజూవారీ వంట్లో లేదా సలాడ్స్ లో ఆవ నూనెను భాగం చేస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.మెదడు చురుగ్గా మారుతుంది.జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.

పైగా ఆవ నూనె జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.అంతేకాదండోయ్.
ఆవ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.ఇవి కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడానికి సహాయపడతాయి.
గోరువెచ్చని ఆవ నూనెను ప్రతి రోజు నొప్పి ఉన్నచోట అప్లై చేసుకుని మర్దన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.