ప్రస్తుతం మనకు ఎన్నో రకాల ఫేస్ క్రీమ్స్( Face creams ) అందుబాటులో ఉన్నాయి.చర్మాన్ని అందంగా ఆకర్షణీయంగా మెరిపించుకోవడానికి ఎవరికి నచ్చిన క్రీమ్స్ ను వారు కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే కెమికల్స్ తో నిండి ఉండే ఆ క్రీమ్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ మాత్రం మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.
మచ్చల నుంచి ముడతల వరకు అనేక చర్మ సమస్యలను తరిమి కొడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు దానిమ్మ గింజలు( Pomegranate seeds ) వేసుకోండి.అలాగే మూడు బీట్ రూట్ స్లైసెస్ ( Beet root slices )కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ దానిమ్మ బీట్ రూట్ జ్యూస్ లో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ), హాఫ్ టీ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.రెండు మూడు నిమిషాల పాటు స్పూన్ తో కలిపితే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.
ఒక బాక్స్ లో ఈ క్రీమ్ ను నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.నిత్యం ఈ క్రీమ్ ను వాడటం అలవాటు చేసుకుంటే స్కిన్ అనేది టైట్ గా మారుతుంది.ముడతలు, చారలు వంటివి దరిచేరకుండా ఉంటాయి.
అలాగే ఈ క్రీమ్ స్కిన్ వైట్నింగ్ కి మద్దతు ఇస్తుంది.చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది.అంతేకాకుండా ఈ న్యాచురల్ క్రీమ్ పిగ్మెంటేషన్ తో సహా ముఖంపై ఎటువంటి మచ్చలనైనా క్రమంగా మాయం చేస్తుంది.స్కిన్ సూపర్ స్మూత్ గా మరియు షైనీ గా మెరిసేలా సైతం ప్రోత్సహిస్తుంది.