ఈ న్యాచురల్ క్రీమ్ వాడితే మచ్చల నుంచి ముడతల వరకు అన్ని సమస్యలు పరార్!

ప్రస్తుతం మనకు ఎన్నో రకాల ఫేస్ క్రీమ్స్( Face Creams ) అందుబాటులో ఉన్నాయి.

చర్మాన్ని అందంగా ఆకర్షణీయంగా మెరిపించుకోవడానికి ఎవరికి నచ్చిన క్రీమ్స్ ను వారు కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయితే కెమికల్స్ తో నిండి ఉండే ఆ క్రీమ్స్ వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ మాత్రం మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.మచ్చల నుంచి ముడతల వరకు అనేక చర్మ సమస్యలను తరిమి కొడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు దానిమ్మ గింజలు( Pomegranate Seeds ) వేసుకోండి.

అలాగే మూడు బీట్ రూట్ స్లైసెస్ ( Beet Root Slices )కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ దానిమ్మ బీట్ రూట్ జ్యూస్ లో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ), హాఫ్ టీ స్పూన్ వెజిటేబుల్ గ్లిజరిన్, హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E Oil )వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

రెండు మూడు నిమిషాల పాటు స్పూన్ తో కలిపితే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.

"""/" / ఒక బాక్స్ లో ఈ క్రీమ్ ను నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి.

నిత్యం ఈ క్రీమ్ ను వాడటం అలవాటు చేసుకుంటే స్కిన్ అనేది టైట్ గా మారుతుంది.

ముడతలు, చారలు వంటివి దరిచేరకుండా ఉంటాయి. """/" / అలాగే ఈ క్రీమ్ స్కిన్ వైట్నింగ్ కి మద్దతు ఇస్తుంది.

చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది.అంతేకాకుండా ఈ న్యాచురల్ క్రీమ్ పిగ్మెంటేషన్ తో సహా ముఖంపై ఎటువంటి మచ్చలనైనా క్రమంగా మాయం చేస్తుంది.

స్కిన్ సూపర్ స్మూత్ గా మరియు షైనీ గా మెరిసేలా సైతం ప్రోత్సహిస్తుంది.

ఖాళీ క‌డుపుతో బెల్లం నీరు తాగ‌డం వ‌ల్ల ఏం అవుతుందో తెలుసా?