అమ్మ అందుకే బయటకు ఎక్కువగా రాదు.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ హీరోగా అతి చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.

 Ntr Interesting Comments On His Mother Shalini Details, Ntr,shalini, Devara, Tol-TeluguStop.com

ఇటీవల ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఈయన కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం తన తల్లి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Telugu Devara, Jr Ntr, Jr Ntr Mother, Rrr, Shalini, Tollywood-Movie

చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో తన తల్లి శాలిని( Shalini ) గారు ఆయనకు నటన నాట్యం పై శ్రద్ధ పెడుతూ డాన్స్ నేర్పించారు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ తన తల్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ తన కష్టాలను ఎప్పుడు దాచిపెట్టుకోలేదు ప్రతి ఒక్క విషయం నాకు చెప్పి జీవితం ఇలాగే ఉంటుందని తెలియజేశారు.

Telugu Devara, Jr Ntr, Jr Ntr Mother, Rrr, Shalini, Tollywood-Movie

ఇక చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఏ రోజు నాకు తోడుగా ఎక్కడికి రాలేదు సాధారణంగా పిల్లల్ని ఒంటరిగా పంపించాలంటే తల్లిదండ్రులు బయ పడతారు.కానీ అమ్మ మాత్రం ఒక్కడివే వెళ్తేనే దేనినైనా సాధించగలరు అన్ని విషయాలను నేర్చుకోగలరని అమ్మ నన్ను ఒక్కడినే పంపించేది.అందుకే ఇప్పుడు నేను స్టార్ హీరో అయినప్పటికీ కూడా అమ్మ బయటకు ఎప్పుడు రాదు.

కష్టం నువ్వే పడ్డావు అందుకు ప్రతిఫలం కూడా నీకే దక్కాలి అంటూ అమ్మ బయటకు రాదని ఎన్టీఆర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఈయన ఇటీవల దేవర సినిమా( Devara ) ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు.

త్వరలోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బిజీ కానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube