ట్రంప్ గెలుపు .. వివేక్ రామస్వామికి ఏ పదవి? అమెరికన్ మీడియాలో కథనాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆయన గెలుపుతో రిపబ్లికన్ల పార్టీలో ఉన్న కొందరు భారత సంతతి నేతలకు కీలక పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.

 Indian Origin Vivek Ramaswamy May Get Senior Role In Trump Admin Details, Vivek-TeluguStop.com

ముఖ్యంగా రిపబ్లికన్ నామినేషన్ కోసం పోటీ చేసిన భారత సంతతి నేత, బిలియనీర్ వివేక్ రామస్వామికి( Vivek Ramaswamy ) కీలక పదవికి దక్కవచని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Telugu Donald Trump, Mike Pompeo, Nikki Haley, Ohio Governor, Republican, Trump,

ఇక తనతో పోటీ పడిన భారత సంతతికే చెందిన నిక్కీ హేలీకి( Nikki Haley ) ఎలాంటి పదవిని ఇవ్వనని ట్రంప్ తేల్చేశారు.మాజీ విదేశాంగ కార్యదర్శి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెడ్ మైక్ పాంపియోకు( Mike Pompeo ) కూడా తన అధికార యంత్రాంగంలో ఎలాంటి పాత్ర ఉండదని ట్రంప్ వెల్లడించారు.ఈ మేరకు తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం.ట్రూత్ సోషల్‌లో స్పష్టం చేశారు.గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనతో కలిసి పనిచేసినందుకు, దేశానికి చేసిన సేవకు గాను వారిద్దరికి ధన్యవాదాలు తెలిపారు.

Telugu Donald Trump, Mike Pompeo, Nikki Haley, Ohio Governor, Republican, Trump,

ఇటీవల పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో రామస్వామి చాలా తెలివైనవాడని, త్వరలోనే పెద్ద పనిలో భాగస్వామి అవుతాడని ట్రంప్ తెలిపారు.బహుశా ట్రంప్ అధికారంలోకి వస్తే రామస్వామికి కీలక పదవి దక్కుతుందని అప్పట్లోనే ప్రచారం జరిగింది.అయితే ట్రంప్ పరిపాలనలో రామస్వామి ఎలాంటి పదవి తీసుకోకపోవచ్చునని.దానికి బదులుగా 2026లో జరగనున్న ఎన్నికలలో ఒహియో గవర్నర్‌గా( Ohio Governor ) ఉండవచ్చని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కాగా.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీపడిన వారిలో వివేక్ రామస్వామి కూడా ఒకరు.

ఈ ఏడాది జనవరిలో అయోవా కాకస్‌లలో నాల్గవ స్థానంలో నిలిచిన ఆయన రేసు నుంచి తప్పుకున్నారు.అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి మద్ధతు లభించకపోవడంతో ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నానని.

డొనాల్డ్ ట్రంప్‌కే తన మద్ధతని వివేక్ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube