సత్యదేవ్ కు అన్యాయం చేసిన రాజమౌళి.. అలా చేయడంతో ఆ నటుడు హర్ట్ అయ్యారా?

నటుడు సత్యదేవ్( Heor Satyadev ) హీరోగా, నటుడిగా చాలా సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.అయితే నటుడిగా బాగానే గుర్తింపు దక్కినప్పటికీ హీరోగా మాత్రం అనుకున్న విధంగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు సత్యదేవ్.

 Satya Dev Reveals His Scenes Edited Rrr Movie Details, Rrr, Rrr Movie, Tollywood-TeluguStop.com

అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన ఇతను చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలోనూ విలనిజం చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.అయితే ఆర్ఆర్ఆర్( RRR ) లాంటి క్రేజీ పాన్ ఇండియా సినిమాలో కూడా ఇతడు నటించాడు అన్న విషయం మనలో చాలామందికి తెలియదు.

కానీ ఆ సీన్లన్నీ లేపేశారు.

Telugu Rajamouli, Heor Satya Dev, Ram Charan, Rrr, Satya Dev, Satyadev Rrr, Toll

ఆ విషయాన్ని మొహమాట పడుతూనే తాజాగా ఆ విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టాడు సత్య దేవ్.ఆర్ఆర్ఆర్ కోసం సత్యదేవ్. దాదాపు 10 రోజుల పాట పనిచేశాడట.

కానీ చివరకొచ్చే సరికి ఇతడికి సంబంధించి దాదాపు 16 నిమిషాలు సీన్లని ఎడిటింగ్‌ లో( RRR Editing ) తీసేశారట.ఆ టీమ్‌ పై ఉన్న గౌరవంతోనే ఇప్పటి వరకు బయటకు చెప్పలేదని కాకపోతే ఆ పదిరోజుల వర్క్ చేయడం మాత్రం మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చాడు సత్య దేవ్.

ఎడిటింగ్ చేస్తే చేశారు కానీ కనీసం ఆర్ఆర్ఆర్ టైటిల్ కార్డ్స్‌లో నైనా సత్యదేవ్ పేరు వేసి ఉండాల్సింది.

Telugu Rajamouli, Heor Satya Dev, Ram Charan, Rrr, Satya Dev, Satyadev Rrr, Toll

కానీ ఈ సినిమాలో ఎక్కడా కూడా సత్యదేవ్ పేరు కనిపించదు.ఇతడు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడట్లేదు గానీ ఈ విషయంలో మాత్రం అన్యాయం జరిగిందనే చెప్పవచ్చు.ఒకటి రెండు కాదు ఏకంగా 16 నిమిషాల సన్నివేశం తీసేయడం అన్నది నిజంగా బాధాకరమైన చెప్పాలి.

ఇకపోతే సత్యదేవ్ తాజాగా నటించిన సినిమా జీబ్రా.ఈ సినిమా నవంబర్ 22న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్ అనేక విషయాల గురించి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube