ఎంత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటే కెరీర్ పరంగా అంత సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.ఐఏఎస్, ఐపీఎస్ పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధించడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.2017 ఐఏఎస్ ఆఫీసర్ అభిలాష శర్మ( IAS Abhilasha Sharma ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.హర్యానాలో( Haryana ) పుట్టి పెరిగిన అభిలాష తను గొప్ప కలలు కని ఆ కలలను నిజం చేసుకునే ప్రయత్నం చేశారు.
2013 సంవత్సరం నుంచి తన లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా ఆమె అడుగులు వేశారు.యూపీఎస్సీ( UPSC ) ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత మూడు ప్రయత్నాలలో ఆశించిన ఫలితాలు రాలేదు.
వరుస వైఫల్యాలు ఆమెను మానసికంగా కృంగదీశాయి.ఇక తాను ఐఏఎస్ కాలేనని భావించిన ఆమె 2017 సంవత్సరంలో అంకిత్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది.
భర్త కుటుంబం సపోర్ట్ తో నాలుగో ప్రయత్నంలో మళ్లీ యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అయిన అభిలాష భర్త, అత్తామామల ప్రోత్సహంతో కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు.రోజుకు 16 గంటల పాటు ప్రిపేర్ అయ్యి లక్ష్యాన్ని సాధించానని ఆమె అన్నారు.తన సక్సెస్ ను భర్తకు అంకితం చేస్తున్నానని ఆమె వెల్లడించారు.లైఫ్ లో ఏదీ సులువుగా దక్కదని కష్టపడితే మాత్రమే కోరుకున్న విజయాలను సొంతం చేసుకోవచ్చని అభిలాష శర్మ తెలిపారు.
అభిలాష శర్మ సక్సెస్ స్టోరీ( Abhilasha Sharma Success Story ) నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.నేటి తరంలో ఎంతోమందికి ఆమె ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు.కష్టపడితే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని ఆమె వెల్లడించారు.అభిలాష శర్మ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అభిలాష శర్మ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.