సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది.ఒకప్పుడు ఇలాంటి కల్చర్ ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోనే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం సాధారణ వ్యక్తులు కూడా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం.
ఇకపోతే ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో క్రిష్ జాగర్లమూడి( Krish Jagarlamudi ) ఒకరు.ఈయన దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇకపోతే ఇటీవల డైరెక్టర్ క్రిష్ రెండో వివాహం( Director Krish Second Marriage ) చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈయన నవంబర్ 11వ తేదీ సన్నిధిలో కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాద్ కి చెందిన డాక్టర్ చల్లా ప్రీతి( Dr.Challa Preethi ) అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు.తాజాగా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలా పెళ్లి ఫోటోలను డైరెక్టర్ క్రిష్ అలాగే డాక్టర్ ప్రీతి ఇద్దరూ కూడా వారి సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ కొత్త ప్రయాణం మొదలైందని చెప్పుకోవచ్చారు.
ఇక ఈయన పెళ్లి చేసుకున్న ఈమె హైదరాబాద్ కి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ అని తెలుస్తుంది.ఈమె కూడా ఇదివరకే ఓ పెళ్లి చేసుకొని భర్త నుంచి విడిపోయారు ఈమెకు 11 సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియడం లేదు.ఇకపోతే క్రిష్ 2016వ సంవత్సరంలో రమ్య( Ramya ) అనే మహిళను వివాహం చేసుకున్నారు.
అయితే ఈమె కూడా డాక్టర్ కావటం విశేషం.ఇలా ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఇద్దరు డాక్టర్లుగా తన జీవితంలోకి వచ్చారని చెప్పాలి.
ఇక రమ్యతో ఈయనకు భేదాభిప్రాయాలు వచ్చాయి దీంతో విడాకులు తీసుకొని విడిపోయారు.వీరి విడాకులకు ఓ హీరోయిన్ కూడా కారణం అంటూ అప్పట్లో రూమర్లు కూడా వినిపించాయి.