వింటర్ లో రోజుకు ఒక యాపిల్ ను ఈ విధంగా తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు!

చలికాలం( Winter Season ) వస్తూ వస్తూనే కొన్ని రోగాలను కూడా మోసుకొస్తుంది.ప్రధానంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి సీజనల్ గా వేధిస్తుంటాయి.

 Taking An Apple In This Way During Winter Is Very Good For Your Health!, Apple,-TeluguStop.com

అలాగే చర్మ సమస్యలు కూడా అధికంగానే ఉంటాయి.మరోవైపు చలి పులి పంజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ లో పలు మార్పులు చేసుకోవాలి.ఆరోగ్యానికి అండగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి.

అటువంటి వాటిలో యాపిల్( Apple ) ఒకటి.యాపిల్ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం రాదని అంటుంటారు.

Telugu Apple, Apple Benefits, Cinnamonapple, Tips, Latest-Telugu Health

కానీ ఈ చలికాలంలో యాపిల్ నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.ముందుగా ఒక యాపిల్ ను తీసుకుని వాటర్ తో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు టేబుల్ స్పూన్ అల్లం తురుము, చిటికెడు జాజికాయ పొడి, ఒక గ్లాసు హోమ్ మేడ బాదం పాలు( Homemade Badam Milkk ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ద్వారా దాల్చిన చెక్క యాపిల్ స్మూతీ సిద్ధం అవుతుంది.

Telugu Apple, Apple Benefits, Cinnamonapple, Tips, Latest-Telugu Health

ప్రస్తుత వింటర్ సీజన్ లో ఈ స్మూతీ మన శరీరానికి చక్కని వెచ్చదనాన్ని అందిస్తుంది.అదే సమయంలో అనేక ఆరోగ్య లాభాలను చేకూరుస్తుంది.చలికాలంలో నిత్యం ఈ స్మూతీని తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజన్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.రక్తంలో కొలెస్ట్రాల్ కరుగుతుంది.

గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.ఈ స్మూతీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఇవి క్యాన్సర్, మధుమేహం మంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

మరియు ఈ యాపిల్ స్మూతీ( Apple Smoothie )ని తీసుకోవడం వల్ల చర్మం సైతం నిగారింపుగా, యవ్వనంగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube