జనసేన అధినేత, డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ( Pithapuram MLA Pawan Kalyan )తాజాగా పిఠాపురంలో పొలం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ 3.52 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం పూర్తైంది.
ఇందులో రెండు ఎకరాల స్థలంలో పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ను నిర్మించుకోనున్నారని సమాచారం అందుతోంది.
మిగిలిన స్థలంలో పవన్ కళ్యాణ్ ఇంటిని నిర్మించుకుని తాను పిఠాపురం ( Pithapuram )వాస్తవ్యునిగా ఉంటానని చెప్పారని భోగట్టా.
ఈ ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ 15 నుంచి 16 లక్షలుగా ఉంది.అయితే పవన్ స్థలాన్ని కొనుగోలు చేయడంతో ఆ స్థలం చుట్టుపక్కల ఉన్న స్థలాలకు డిమాండ్ పెరిగిందని భోగట్టా.
ఎకరం అరకోటి ఖర్చు చేసి కొనుగోలు చేయడానికి కూడా కొంతమంది పవన్ అభిమానులు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
అయితే తమ పొలాలకు ఎక్కువ మొత్తంలో ఆఫర్లు వస్తుండటంతో పొలం యజమానులు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారని సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ వల్ల భూములకు ఇంత డిమాండ్ పెరిగిందా అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీపై( YCP ) విమర్శలు చేయడం లేదనే సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరింత మంచి పేరును సొంతం చేసుకోవాలని నెటిజన్ల నుంచి అవకాశాలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను వేగంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందని వార్తలు వస్తుండగా ఆ వార్తల గురించి హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.