టాలీవుడ్ స్టార్ యాంకర్ గా వరుస సినిమా ఈవెంట్లతో పాటు బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న సుమా కనకాల( Suma Kanakala ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఇండియన్ 2( Indian 2 ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో సందడి చేశారు ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి యాంకర్ గా సుమా వ్యవహరించారు.
ఈ సినిమా జూలై 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించగా చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.అయితే ఈ సినిమాలో నటుడు సిద్ధార్థ్( Siddharth ) కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన యాంకర్ సుమతో పాటు చేసిన ఓ పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది సుమ వేదికపై మాట్లాడుతూ ఉండగా సిద్ధార్థ్ కూడా మాట్లాడుతూ మనం వేదికపై మాట్లాడితే చాలా ఓవర్ చేస్తామని అందరూ అంటూ ఉంటారు.
అయితే ఇకపై మరింత ఓవర్ చేద్దాము అంటూ సుమ భుజంపై చేతులు వేశారు.

ఇలా సుమ భుజంపై చేతులు వేయడమే కాకుండాఎప్పటి నుంచో మీరు చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హోస్ట్ గా చేస్తూన్నారు.ఇప్పుడు భారతీయుడు 2( Bharateeyudu 2 ) అయిపోయింది నెక్స్ట్ 3, 4, 5 ఇలా ఎన్ని సీక్వెల్స్ వచ్చిన వాటన్నింటికి మీరే హోస్ట్ గా వ్యవహరించాలని కోరుకుంటున్నానని తెలిపారు.దాంతో సుమ మాట్లాడుతూ.
ఎన్ని సంవత్సరాలైనా మనిద్దరి ఏజ్ ఎవరూ పసిగట్టలేరు అందరికీ ఏజ్ పెరుగుతున్న మనకు మాత్రం అక్కడే ఆగిపోతుంది అంటూ తనదైన స్టైల్ లో మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే సుమ భుజంపై చేతులు వేయటంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.