ఉద్యోగం ఏదైనా ఒత్తిడి ఉండటం సహజం.కానీ, వర్క్‌ప్లేస్ టాక్సిక్‌గా ఉండి, బాస్ అన్‌సపోర్టివ్‌గా, ఇన్‌సెన్సిటివ్‌గా ఉంటే మాత్రం ఆ ఒత్తిడి మరింత పెరుగుతుంది.
ఇలాంటి అన్‌ఫెయిర్ వర్క్ ఎన్విరాన్‌మెంట్ నెగిటివిటీ, డిప్రెషన్, గొడవలకు దారి తీస్తుంది.దీని ఫలితంగా, చైనాలో యువ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగ ఒత్తిడిని తట్టుకునేందుకు విచిత్రమైన, కానీ ఫన్నీ పద్ధతులను అలవాటు చేసుకున్నారు.
ఇటీవల చైనీస్ ఉద్యోగులు తమ బాస్‌లు, కొలీగ్స్, జాబ్స్‌ను సెకండ్ హ్యాండ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో అమ్మకానికి పెట్టడం స్టార్ట్ చేశారు.ఈ ట్రెండ్ దేశంలో వైరల్‌గా మారింది.
అలిబాబా సెకండ్ హ్యాండ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన క్సియాంయులో, చాలా మంది పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి, పని తర్వాత వచ్చే అలసట (వర్క్ స్మెల్)ని తీసేయడానికి ఫన్నీగా తమ ఉద్యోగాలు, సహచరులను అమ్మకానికి పెడుతున్నారు.చైనాలో, వర్క్ స్మెల్ అంటే పనిలో చాలా అలసిపోయాక వచ్చే మానసిక, శారీరక అలసటను సూచిస్తుంది.
ఆన్‌లైన్‌లో వచ్చిన వార్తల ప్రకారం, క్సియాంయు వెబ్‌సైట్‌లో కొన్ని అమ్మకాల లిస్ట్‌లు ఉన్నాయి.వాటిలో చాలా “ఇబ్బందికరమైన బాస్‌లు”, “చాలా చెత్త ఉద్యోగాలు”, “చాలా చిరాకు పెట్టే సహచరులు” కూడా ఉన్నారు.వీటి ధరలు రూ.4 నుంచి రూ.9 లక్షల మధ్య ఉంటాయి.తన ఉద్యోగాన్ని రూ.91,000/-లకు అమ్మకానికి పెట్టిన ఒక వ్యక్తి, నెలకు రూ.33,000/- వేతనం ఇస్తారని, కొనుగోలుదారులు మూడు నెలల్లో లోపే ఖర్చు తిరిగి పొందుతారని చెప్పారు.
“ఎప్పుడూ వ్యంగ్యంగా మాట్లాడే సహచరుడిని 3,999 యువాన్ (సుమారు రూ.45,925/-) ధరకు అమ్మకానికి పెడుతున్నాను.వారితో ఎలా డీల్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను.ఆఫీసులో బాధితుడిగా మిగలకుండా ఉండే 10 టిప్స్ కూడా ఇస్తాను.” అని మరొకరు అన్నారు.
మూడవ వ్యక్తి తన “చాలా చెత్త బాస్” ను 500 యువాన్ (సుమారు రూ.5,742/-) ధరకు అమ్మకానికి పెట్టాడు.వారిద్దరి స్వభావాలు కలవలేదని, బాస్ తరచూ తనని విమర్శిస్తారని, దానివల్ల చాలా మానసిక ఒత్తిడి వస్తుందని చెప్పాడు.
ఇదంతా ఆటగానే తప్ప, నిజంగా ఎవరినీ డబ్బుకు అమ్మడం లేదని గమనించాలి.ఎవరైనా ఆ “ఉత్పత్తి” ని కొనుగోలు చేస్తే, సాధారణంగా అమ్మే వారు డబ్బు లావాదేవాలను రద్దు చేసేస్తారు లేదా కొనుగోలు ప్రయత్నాన్ని నేరుగా తిరస్కరిస్తారు.
“ఎవరో ఒకరు డబ్బు చెల్లించారు, కానీ వారికి డబ్బు తిరిగి ఇచ్చేలా దరఖాస్తు చేసుకున్నాను, తర్వాత లిస్టింగ్‌ను తొలగించాను.ఇది కేవలం నా భావోద్వేగాలను బయటపెట్టే పద్ధతి మాత్రమే.నిజంగా ఎవరినీ అమ్మడం లేదు.క్సియాంయులో చాలా మంది తమ ఉద్యోగాలను అమ్ముతున్నారు, నేను కూడా ప్రయత్నించాలనుకున్నాను.వీకెండ్స్ లేని నా ఉద్యోగాన్ని కేవలం 9.9 యువాన్‌కు అమ్మడం అంటే చిన్నపాటి ప్రతీకారం లాగా ఉంది” అని ఒక గుర్తు తెలియని వ్యక్తి దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్‌కు చెప్పారు.ఆన్‌లైన్‌లో కొంతమంది ఈ ట్రెండ్‌ని చూసి నవ్వుకుంటున్నా, మరికొంతమంది దీని పరిణామం ఏమవుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.