ముఖ్యంగా చెప్పాలంటే చెవి( Ear ), ముక్కు( Nose ) నుంచి నీరు రావడం నిజంగా ప్రమాదానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు చెవి ఇన్ఫెక్షన్, నొప్పికి కూడా కారణం కావచ్చు.
అటువంటి పరిస్థితులలో చెవి నుంచి తెలుపు లేదా పసుపు ద్రవం వస్తే, ఆ ద్రవం నీరు, రక్తం, చీము కావచ్చు.చెవి నుంచి ద్రవం రావడం వివిధ వ్యాధులకు సంకేతం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందువల్ల ఇలాంటి వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

చెవి నుంచి నీరు( Water ) రావడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.చెవి నుంచి నీరు రావడానికి చాలాసార్లు చెవిలో గాయం కూడా కారణం కావచ్చు.ఈ సమస్యలో మీరు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.
లేదంటే సమస్యలు పెరిగే అవకాశం ఉంది.చెవి నుంచి చీము లేదా నీరు రావడం కూడా చెవిలో ఇన్ఫెక్షన్ కు కారణం కావచ్చు.
చెవి ఇన్ఫెక్షన్( Ear Infection ) ఉన్నప్పుడు కూడా చెవి నుంచి చీము రావచ్చు.చెవి లోపల నీరు చేరినప్పుడు చెవి నుంచి నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
స్నానం చేసేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు చెవిలోకి నీరు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.అదే నీరు తర్వాత బయటకి వచ్చే అవకాశం కూడా ఉంది.
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీరు ప్రవేశించి చెవి నుంచి పసుపు, తెలుగు లేదా గోధుమ రంగు ద్రావం బయటకి వస్తుంది.చెవి నుంచి నీరు వచ్చినప్పుడు ఈ చిట్కాలను పాటించి తగ్గించుకోవడం మంచిది.

తులసి ఆరోగ్యానికి అలాగే చెవి సమస్యలను దూరం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అందుకోసం తులసి ఆకుల రసాన్ని( Tulsi Water ) తీసి చెవిలో వేస్తే చెవి ఇన్ఫెక్షన్ దూరం అవుతుంది.చెవి నొప్పి సమస్య కు త్వరగా ఉపశమనం లభిస్తుంది.ఇంకా చెప్పాలంటే వెల్లుల్లి( Garlic )లో అల్లిసీన్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది.ఇది ఇన్ఫెక్షన్ తో పోరాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.కాబట్టి రెండు వెల్లుల్లి రెబ్బలను, ఆవాల నునెలో వేసి వేడి చేయాలి.
ఈ నూనె చల్లబడిన తర్వాత రెండు చుక్కలు చెవిలో వేయవచ్చు.