ఒక్క నైట్ లో ముఖాన్ని గ్లోయింగ్‌ గా మరియు షైనీగా మార్చే సింపుల్ చిట్కాలు ఇవే!

These Are The Simple Tips To Make Your Face Glowing And Shiny Overnight Details! Glowing Face, Shiny Skin, Skin Care, Skin Care Tips, Beauty, Beauty Tips, Latest News, Simple Tips

సాధారణంగా కొందరి ముఖం ఉదయానికి చాలా డల్ గా కనిపిస్తుంటుంది.ఆహారపు అలవాట్లు, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, మొబైల్ ఫోన్‌ను అధికంగా వినియోగించడం, వాటర్ ను సరిగ్గా తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల ముఖంలో నిగారింపు త‌గ్గిపోయి డ‌ల్‌గా మారుతుంటుంది.

 These Are The Simple Tips To Make Your Face Glowing And Shiny Overnight Details!-TeluguStop.com

అటువంటి ముఖంతో బయటకు వెళ్లేందుకు చాలా మంది అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే ఒక్క రాత్రిలో ముఖం గ్లోయింగ్‌గా మ‌రియు షైనీగా మారుతుంది.

మరి ఇంతకీ ఆ చిట్కాలు ఏంటి.? అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఒక బౌల్‌ తీసుకుని అందులో ఒక కప్పు పాలను పోయాలి.ఆ పాలలో కొద్దిగా వ‌ట్టివేరును వేసి మూత పెట్టి కనీసం నాలుగు గంటల పాటు నాన‌పెట్టుకోవాలి.

అనంతరం పాలను ఫిల్టర్ చేసుకుని స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.నైట్ నిద్రించే ముందు వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని అనంతరం ఈ పాలను ముఖానికి స్ప్రే చేసుకోవాలి.

ఇలా చేస్తే కనుక ఉదయానికి ముఖం కాంతివంతంగా మరియు షైనీ గా మెరుస్తుంది.

Telugu Tips, Face, Latest, Shiny Skin, Simple Tips, Skin Care, Skin Care Tips-Te

అలాగే మరో చిట్కా ఏంటంటే.ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ను వేసుకోవాలి.అలాగే అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేసుకుని పడుకోవాలి.ఇలా నైట్ నిద్రించే ముందు చేస్తే డ‌ల్ స్కిన్ కు దూరంగా ఉండొచ్చు.

ఈ చిట్కా వల్ల ముఖం అందంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.పైగా చర్మంపై ఏమైనా మచ్చలు ఉన్నా క్రమంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube