ఆస్కార్‌ రేసులోకి ఎంట్రీ ఇచ్చిన ‘కంగువా’

సినిమా రంగంలో ఆస్కార్‌ అవార్డు( Oscar Award ) పొందడం అంటే క్రికెట్‌లో వరల్డ్‌ కప్‌ గెలుచుకోవడం లాంటిదని చెప్పవచ్చు.ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన నటీనటులు, దర్శకులు తమ జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్‌ అవార్డును గెలవాలని కలలు కంటారు.

 Suirya Kanguva Enters Oscars 2025 Race Details, Oscars 2025, Indian Cinema, Kang-TeluguStop.com

గతేడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంకు ఓ కేటగిరీలో ఆస్కార్‌ గెలుచుకోవడం ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పింది.ఆర్‌ఆర్‌ఆర్‌( RRR ) విజయం తర్వాత, భారతీయ సినిమాలు ఆస్కార్‌ బరిలో మరింత ఉత్సాహంగా పోటీలోకి దిగుతున్నాయి.

అయితే తాజాగా 2025లో జరగబోయే 97వ ఆస్కార్‌ అవార్డుల కోసం భారతీయ చిత్రాలు పోటీలో ఉన్నాయి.అందులో సూర్య( Suriya ) ప్రధాన పాత్రలో నటించిన ‘కంగువా’,( Kanguva ) పృథ్విరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) హీరోగా నటించిన ‘ఆడు జీవితం’( Aadu Jeevitham ) (ఇంగ్లీష్‌లో ‘ది గోట్ లైఫ్’) ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నాయి.

ఇవే కాకండా ఇండియా నుంచి ఆస్కార్‌ బరిలో నిలిచిన ఇతర చిత్రాలు చూస్తే.సంతోష్‌ (హిందీ చిత్రం) , ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం), స్వాతంత్ర వీర సావర్కర్‌ లు కూడా రేసులో ఉన్నాయి.

ఇక అకాడమీ షార్ట్‌లిస్ట్ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది.తరువాత జనవరి 17న ఫైనల్ నామినేషన్లు ప్రకటించబడతాయి.

కిరణ్ రావు దర్శకత్వంలో రూపొందించిన ‘లాపతా లేడీస్’( Laapataa Ladies ) కూడా ఆస్కార్‌ బరిలో మొదట ఎంపికైంది.కానీ, షార్ట్‌లిస్ట్‌లో స్థానం సంపాదించలేకపోయింది.ఇది డిసెంబర్‌ 17న విడుదల చేసిన షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ, భారతీయ నటి షహనా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘సంతోష్‌’( Santosh Movie ) యూకే నుంచి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో చోటు సంపాదించింది.ఉత్తమ చిత్రం విభాగంలో ‘కంగువా’, ‘ఆడు జీవితం’ చిత్రాలు ఆస్కార్‌ బరిలో ఉన్నాయి.

అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి.బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్విరాజ్ నటించిన ‘ఆడు జీవితం’ చిత్రం సర్వైవల్ థ్రిల్లర్‌ కథాంశంతో ఆకట్టుకుంది.విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.సూర్య నటించిన కంగువా భారీ బడ్జెట్‌ చిత్రం రూ.2000 కోట్ల వసూళ్లను కొల్లగొడుతుందని చిత్ర బృందం ప్రచారం చేసినప్పటికీ, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.అయితే నటన, మేకింగ్‌ పరంగా మంచి మార్కులు పొందింది.

ఆస్కార్‌ బరిలో నిలిచిన ఈ చిత్రాలు భారతీయ సినిమాలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారత ప్రతిభను ప్రదర్శిస్తున్నాయి.ఇండియన్ సినిమాల గ్లోబల్ గుర్తింపు పెరుగుతుండటం సినీ ప్రేమికులకు గర్వకారణంగా మారింది.

జనవరి 17న ప్రకటించే నామినేషన్లలో ఈ చిత్రాలు చోటు దక్కించుకోవాలని భారతీయ సినీ ప్రియులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube