రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారత్ ఎన్నికల సంఘం ఆదేశాలు అనుసరించి ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం 2025 లో భాగంగా 4 లక్షల 76 వేల 345 ఓటర్లతో జిల్లా తుది ఓటరు జాబితా విడుదల చేశామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.సిరిసిల్ల జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని,
వీటికి సంబంధించి మొత్తం 4 లక్షల 76 వేల 345 ఓటర్లతో తుది ఓటర్ జాబితా తయారు చేశామని, మహిళా ఓటర్లు 2 లక్షల 47 వేల 46 మంది , పురుష ఓటర్లు 2 లక్షల 29 వేల 352 మంది, ఇతర ఓటర్లు 37 మంది నమోదయ్యారని తెలిపారు.
జిల్లాలో మొత్తం 169 సర్వీస్ ఓట్లు ఉన్నాయని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.