రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభించిన సందర్భంగా కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రైతులతో కలసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అలాగే టపాసులు పేలుస్తూ, మిఠాయిలు పంపిణీ చేసి, సంబరాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో రైతులందరికీ 12 వేలు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో భూము లేని రైతుకి ఇస్తాం అని, భూమిలేని వ్యవసాయ రైతుల కూలీలకు ప్రతి ఏటా 12 వేలు,రేషన్ కార్డు లేని వారికి నూతన రేషన్ కార్డులు కూడా ఇస్తామని ప్రకటించడం అన్నారు.ఈ పథకాలన్నీ జనవరి 26 నుండి ప్రారంభం అవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా,మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.







