సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది.రోజు రోజుకు ఎండలు పెరిగిపోతుండడంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు.
ఇక ఈ సీజన్‌లో చెమటలు, అధిక ఉష్ణోగ్రతలు కారణంగా శరీరం నుంచే కాకుండా తలలో నుంచి కూడా చెడు వాసన వస్తూ ఉంటుంది.తరచూ తల స్నానం చేస్తున్నప్పటికీ ఈ సమస్య కనిపిస్తుంది.
ఎందుకూ అంటే ఎండల వల్ల తలలో కూడా చెమటలు పట్టేస్తాయి.ఆ చెమటలతో దుమ్ము, ధూళి కూడా పేరుకుపోయి దుర్వాసన వస్తూ ఉంటుంది.
ఇక ఈ సమస్యను ఎలా నివారించుకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడుతూ తెగ ఫీల్ అవుతుంటారు.కానీ, కొన్ని న్యాచురల్ టిప్స్ పాటిస్తే తలలో నుంచి వచ్చే చెడు వాసనకు చెక్ పెట్టవచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేయండి.ముందుగా గ్రీన్ టీని తయారు చేసుకోవాలి.
ఈ టీలో కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలపై పోసుకుని వేళ్లతో బాగా మసాజ్ చేసుకోవాలి.
ఇరవై నిమిషాల తర్వాత షాంపూతో హెడ్ బాత్ చేయాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే తలలో నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.
అలాగే గులాబీలతో కూడా ఈ సమస్యను నివారించుకోవచ్చు.ముందుగా కొన్ని గులాబీ ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి అందులో పాలు యాడ్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాని తలకు పట్టించి అర గంట పాటు వదిలేయాలి.ఆ తర్వాత తలస్నానం చేయాలి.ఇలా డే బై డే చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఒక మగ్ హాట్ వాటర్‌లో ఒక స్పూన్ నిమ్మ రసం, అర స్పూన్ వెనిగర్ వేసి బాగా మిక్స్ చేయండి.
ఈ వాటర్‌ను స్ప్రే బాటిల్‌లో నింపి తలకు స్ప్రే చేసుకోవాలి.ఆ తర్వాత హెడ్ బాత్ చేయాలి.ఇలా చేసినా తలలో నుంచి చెడు వాసన రాకుండా ఉంటుంది.