ట్రోల్స్ ఎఫెక్ట్... డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటి... షాకింగ్ విషయాలు రివీల్?

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీల గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా స్పందిస్తూ వారిపై విమర్శలు ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.ఇలా ఎంతోమంది ఇండస్ట్రీలో ఎదురయ్యే విమర్శలను తట్టుకోలేక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నవారు ఉన్నారు.

 Meenakshi Chaudhary Sensational Comments On Trolls Her Acting In The Goat Movie-TeluguStop.com

వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ మంచి సక్సెస్ అందుకున్న వారు కూడా ఉన్నారు.ఇలా ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో నటి మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) ఒకరు.

Telugu Lucky Bhaskar, Goat-Movie

ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఇటీవల ఈమె లక్కీ భాస్కర్( Lucky Bhaskar ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వెంకటేష్( Venkatesh ) నటించిన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) అనే సినిమాలో కూడా నటించారు.ఈ సినిమా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.

Telugu Lucky Bhaskar, Goat-Movie

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి గతంలో తన గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందించారు.తాను హీరో విజయ్ తో కలిసి నటించిన ది గోట్( The Goat ) సినిమా సమయంలో తనపై ఎన్నో రకాల విమర్శలు ట్రోల్స్ వచ్చాయని తెలిపారు.సోషల్ మీడియాలో నా గురించి వచ్చిన ట్రోల్స్ చూసి తాను ఒక వారం రోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని మీనాక్షి చౌదరి తెలిపారు.అయితే వాటిని తాను అలవాటుగా చేసుకున్నానని ప్రస్తుతము అలాంటి వాటిని పట్టించుకోవడంలేదని ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమాతో పాటు ఈమె నవీన్ పోలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదల చేసిన వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube