రైలు ప్రయాణం అనేది అందరికి ఎంతో ఆసక్తి, ఆనందాన్ని కలిగించే అనుభవం.రైలు ప్రయాణంలో ఎదురయ్యే కొత్త పరిచయాలు, కిటికీ దృశ్యాలు, తోటి ప్రయాణీకులతో కలసి మాట్లాడటం ఇవన్నీ ప్రయాణానుభవాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుతాయి.
కానీ, ఈ మధ్యకాలంలో కొంతమంది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనతో ఈ రైలు ప్రయాణాన్ని నాశనం చేస్తున్నారు.తాజాగా, ఒక యువకుడు రైలు కోచ్‌లో( Train Coach ) చేసిన అరాచకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా( Viral Video ) మారింది.
ఈ వీడియోలో.ఖాళీ జనరల్ కోచ్‌లో ఉన్న ఒక యువకుడు సీటు కవర్లను( Seat Covers ) చించి, ఆపై వాటిని కిటికీ ద్వారా బయటకు విసిరేస్తున్నాడు.
ఈ వీడియోను గమనించినట్లయితే.అతను ఈ పని చేసినందుకు చాలా ఆనందంగా, ఉత్సాహంగా కనిపిస్తుండటంతో ఇది కావాలని చేసిన చర్యగా అనిపిస్తోంది.రీల్ వీడియో కోసం చేసిన ఈ దుశ్చర్య నెటిజన్లలో ఆగ్రహానికి గురి చేసింది.ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే, చాలా మంది నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రైల్వే ఆస్తులను ధ్వంసం( Railway Property Damage ) చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
‘ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యక్తులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఇలా తేలికగా తప్పించుకుపోవడం తగదని కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరు యువకుడిని పోలీసులు పట్టుకొని అతనిపై కేసు నమోదు చేయాలని, నష్టాన్ని భర్తీ చేయించాలని కోరుతున్నారు.అలాగే ఈ ఘటనపై రైల్వే శాఖ చురుకైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు.
రైల్వే ఆస్తులను రక్షించేందుకు భద్రతా చర్యలు తీసుకోవడం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయడం ముఖ్యం.ప్రయాణాల్లో రైల్వే ఆస్తులను జాగ్రత్తగా ఉపయోగించండి.
రీల్ వీడియోలు చేయడమే కాదు, మనందరి భవిష్యత్‌కు సానుకూల మార్గదర్శకులుగా నిలిచేందుకు ప్రయత్నించండి.