ఈ నెల 8 నుంచి 10 వరకు ఒడిషా( Odisha ) రాజధాని భువనేశ్వర్‌లో జరగనున్న 18వ ప్రవాసీ భారతీయ దివస్‌కు( 18th Pravasi Bharatiya Divas ) సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ నేపథ్యంలో భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో( Biju Patnaik International Airport ) ప్రవాస భారతీయులకు ఘన స్వాగతం పలికేందుకు ఒడిషా బీజేపీ విభాగం సిద్ధమైంది.
ఈ మేరకు ఒడిషా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్( Odisha BJP Chief Manmohan Samal ) మీడియాకు వివరాలు తెలిపారు.అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఒడిషా పర్యటన ఉండాలని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను సమాల్ కోరారు.
స్వచ్ఛభారత్ అభియాన్‌లో భాగంగా పరిశుభ్రతను పెంపొందించడంపై దృష్టి సారించామని.రాష్ట్రంలో ఎన్ఆర్ఐలు( NRI’s ) ఉన్న సమయంలో 30 జిల్లాల్లో బీజేపీ( BJP ) పాదయాత్రలు నిర్వహించనుందని మన్మోహన్ తెలిపారు.
అలాగే జనవరి 8న సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీకి( PM Narendra Modi ) ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
మూడు రోజుల పాటు జరిగే ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో దాదాపు 160 దేశాల నుంచి 7000 మంది ఎన్ఆర్ఐలు సహా దాదాపు 10 వేల మందికి పైగా అతిథులు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రినిడాడ్ అండ్ టుబాగో అధ్యక్షురాలు క్రిస్టెన్ కాంగాలూ( Christine Kangaloo ) హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంతో పాటు చందకలోని గొడిబారి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులతోనూ ఆమె ముఖాముఖి నిర్వహించనున్నారు.
అతిథులను అలరించేందుకు స్ట్రీట్ ఫెస్టివల్, ఏకామ్ర ఉత్సవ్, గిరిజన జాతరలు వంటి వాటిని నిర్వహించనున్నారు.రాజా రాణి సంగీత ఉత్సవం, ఒడిస్సీ నృత్యం, ముక్తేశ్వర్ డ్యాన్స్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాల ద్వారా ఒడిషా సంస్కృతి, వారసత్వాన్ని ప్రదర్శించాలని అధికారులను ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ మాఝీ ఆదేశించారు.
ప్రవాసీ భారతీయ దివస్‌కు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరుకానున్నారు.