నందమూరి బాలకృష్ణ,( Nandamuri Balakrishna ) జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) మధ్య గ్యాప్ ఉందని ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపించే ఛాన్స్ లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.అదే సమయంలో బాలయ్య సినిమా డాకు మహారాజ్( Daaku Maharaaj ) ను తాము చూడబోమని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే బాలయ్య, ఎన్టీఆర్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదనే అర్థం వచ్చేలా నాగవంశీ( Nagavamsi ) కామెంట్స్ చేశారు.
అన్ స్టాపబుల్ షోలో తాను కూడా బాబీతో కలిసి పాల్గొన్నానని ఆ షోలో జై లవకుశ మూవీ గురించి కానీ జూనియర్ ఎన్టీఆర్ గురించి కానీ రాలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్ గురించి బాలయ్య మాట్లాడారని ఆ సీన్ ను ఎపిసోడ్ లో కట్ చేశారని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని నాగవంశీ స్పష్టం చేశారు.అయితే బయట మాట్లాడే సమయంలో తారక్ పేరును ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు.
బాలయ్య ప్రస్తావించిన సినిమా పేరు నాకు గుర్తుకు రావడం లేదు కానీ ఒక సినిమాలోని రోల్ జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తే బాగుంటుందని బాలయ్య నాతో, బాబీతో అన్నారని ఆయన చెప్పుకొచ్చారు.ఆఫ్ లైన్ లో ఈ కామెంట్లు చేశారని ఆయన తెలిపారు.మరోవైపు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 9వ తేదీన అనంతపురంలో జరగనుంది.నారా లోకేశ్( Nara Lokesh ) ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి జిల్లాల్లో అనంతపురం ఒకటి.అనంతపురంలో డాకు మహారాజ్ ఈవెంట్ ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.డాకు మహారాజ్ సినిమాకు 83 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగడం గమనార్హం.