ఆమె సైన్ చేసినప్పుడే గేమ్ ఛేంజర్ డిజాస్టర్.. కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి కమల్ ఆర్ ఖాన్( Kamaal R Khan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఫిలిం క్రిటిక్ గా చెప్పుకుంటూ సినిమాలకు రివ్యూ ఇస్తూ ఉంటారు.

 Kamaal R Khan Insults Ram Charan Game Changer Details, Kamaal R Khan ,ram Charan-TeluguStop.com

సెలబ్రిటీలను విమర్శించడమే పనిగా పెట్టుకుంటాడు.ఏవైనా పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయంటే చాలు, పని గట్టుకుని మరీ నెగిటివ్ కామెంట్లు చేస్తుంటాడు.

అలా తాజాగా సికిందర్ అలాగే గేమ్ చేంజర్( Game Changer ) సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేఆర్ కే.ఈ మేరకు గేమ్ చేంజ్ సినిమాపై స్పందిస్తూ.ఒక జెండా లుక్ యాక్టర్ రామ్‌ చరణ్( Ram Charan ) నటించిన భోజ్‌పురి చిత్రం గేమ్‌ చేంజర్ జనవరి 10న విడుదల కానుంది.

Telugu Game Changer, Kamaal Khan, Kamaalkhan, Kiara Advani, Ram Charan, Ramchara

ఇది ఇప్పటికే రిలీజ్ కు ముందే డిజాస్టర్‌ గా మారింది.ఐకాన్ మెగా సూపర్ స్టార్ అల్లు అర్జున్ లో( Allu Arjun ) రామ్ చరణ్ 0.001శాతం కూడా లేడని జనవరి 10వ తేదీన అధికారికంగా రుజువవుతుంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు.కియారా అద్వానీ( Kiara Advani ) గేమ్‌ చేంజర్ సినిమాకి సైన్ చేసినప్పుడే అది డిజాస్టర్ అవుతుందని చెప్పాను.కియారా దానిని అర్థం చేసుకోవడానికి 3 ఏళ్లు పట్టింది.

ఇప్పుడు సినిమాను ప్రమోట్ చేయడానికి నిరాకరించింది.సినిమాపై వారికి ఉన్న అవగాహనకు ఇదే నిదర్శనం.

వాళ్లంతా తుక్కేబాజ్ అని కమల్ ఆర్ ఖాన్ మరో పోస్ట్ పెట్టాడు.

Telugu Game Changer, Kamaal Khan, Kamaalkhan, Kiara Advani, Ram Charan, Ramchara

అంతకముందు ట్వీట్ లోనూ ఈ చిత్రాన్ని విమర్శించాడు.సినిమా డిజాస్టర్ అవుతుందని తెలిసే కియారా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటోందని అన్నాడు.ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ట్వీట్లు వైరల్ అవ్వడంతో రామ్ చరణ్ అభిమానులు అలాగే బాలీవుడ్ నెటిజన్స్ మండిపడుతున్నారు.

బూతులతో మాట్లాడుతూ రెచ్చిపోయి మరి కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube