హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలలో ఒక్కో మాసానికి ఎంతో ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది.ఈ క్రమంలోనే కార్తీక మాసం ఎంతో పరమ పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు.
ఈ క్రమంలోనే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివకేశవులకు పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాము.అదేవిధంగా ఈ నెల మొత్తం ఎలాంటి మాంసాహారాన్ని ముట్టుకోకుండా నెల మొత్తం నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగిస్తూ నిత్యం పండుగ వాతావరణంలో భక్తులు గడుపుతుంటారు.
ఎంతో పవిత్రమైన ఈ కార్తీకమాసం లో చాలామంది నూతన గృహ ప్రవేశాలు చేయడం, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం మనం చూస్తున్నాము.అయితే ఎక్కువగా కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కార్తీక మాసం ఆరంభం నుంచి ఆకాశదీపం వెలిగిందనిప్రతి రోజు ఎంతో మంది ఉదయం సాయంత్రం తులసి కోట ముందు దీపారాధన చేసి తులసి మాతను పూజిస్తుంటారు ఈ నెలలో వెలిగించే దీపాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి కార్తీకదీపం కాగా మరొకటి ఆకాశదీపం.సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి కోట ముందు వెలిగించే దీపాన్ని ఆకాశదీపం అని పిలుస్తారు.
ఇలా నెల మొత్తం కార్తీక దీపాలు వెలిగిస్తూ పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఇక ఈ నెలలో సత్యనారాయణ స్వామిని కూడా భక్తులు ఎంతో భక్తితో పూజిస్తారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తుంటారు.ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఈ వ్రతం ఎక్కువగా చేయడం మనం చూస్తుంటాము.
అసలు కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి ఎందుకంత అనువైన మాసం అనే విషయానికి వస్తే.ఎంతో పవిత్రమైన కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు.ఇంత పవిత్రమైన మాసంలో పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.ఇక ఈ మాసంలో ఎంతో పవిత్రమైన ఉసిరికాయలపై దీపారాధన చేయడం, దీప దానం చేయడం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.