ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మెరుగైన సేవలను అందించేందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తూ ఉంది.
ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎప్పుడు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుంది.అందుకోసం ప్రతి రోజు వేలమంది భక్తుల వసతి కోసం బుక్ చేసుకునే గదులకు సర్వీస్ ఛార్జీలు కాషన్ డిపాజిట్ చెల్లింపులను ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల లో డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేసింది.యూపీఐ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపులను స్వీకరిస్తున్నారు.
గదులను పొందే సమయంలో గదుల అద్దెతో పాటు కాషన్ డిపాజిట్ సైతం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పేమెంట్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది.భక్తులు గదులు ఖాళీ చేసే సమయంలో ఈ ఓటిపి చెప్పడం ద్వారానే కాషన్ డిపాజిట్ నగదు వినియోగదారులకు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టారు.ఇంకా చెప్పాలంటే తిరుమలలో రూ.50 నుంచి రూ.500 రూపాయల వరకు అద్దె కలిగిన గదులు పొందే సమయంలో అదనంగా 500 రూపాయలను కాషన్ డిపాజిట్ కింద చెల్లించాల్సిన అవసరం ఉంది.గదిని పొందే సమయం లో భక్తుడి సెల్ నెంబర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఓటిపి వస్తుంది. గది ఖాళీ చేసే సమయంలో ఈ ఓటిపి తెలియజేస్తే డిపాజిట్ చేసిన డబ్బు రిఫండ్ అవుతుంది.
గదులను ఖాళీ చేసే సమయంలో భక్తుల ఫోన్ కి వచ్చిన ఓటీపీ తెలుసుకొని దళారులు ఆ డిపాజిట్ సొమ్మును తమ బ్యాంకుల్లో వేసుకుంటున్నారు.
ఇంకొందరు భక్తులు ఓటిపి తెలియజేయకుండా వెళ్లిపోయి.డిపాజిట్ రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వీటన్నిటిని దూరం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కొత్తగా ఫేస్ రికగ్నేషన్ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తుంది.
ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా వారం పాటు పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది.
DEVOTIONAL