భారతీయులపై అమెరికన్ విషం.. ‘H1B వైరస్’ అంటూ.. వీడియో చూస్తే రక్తం మరిగిపోతుంది!

అమెరికాలో ఉన్న భారతీయులకు( Indians ) ఇటీవల ఒక షాక్ తగిలింది.డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి శ్రీరామ్ కృష్ణన్ ( Sriram Krishnan )అనే వ్యక్తి AI సలహాదారుగా నియమితులైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇండియాకి వ్యతిరేకంగా విమర్శలు ఎక్కువయ్యాయి.

 Americas Poison On Indians Is Called H1b Virus-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే, ఎక్స్‌లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియో చూస్తే ద్వేషం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.ఒక అమెరికన్ వ్యక్తి అమెరికాలో ఉంటున్న భారతీయుల దగ్గరికి వెళ్లి, వాళ్లతో ఒక పిటిషన్‌పై సంతకాలు చేయించుకుంటున్నాడు.

ఆ పిటిషన్ దేని గురించో తెలుసా? “H1B వైరస్ వ్యాప్తిని ఆపండి” అంట! అతను చాలా మంది భారతీయులు నడుపుతున్న షాపులకు వెళ్లి మరీ సంతకాలు అడుగుతున్నాడు.

అసలు ఆ H1B వైరస్ ( H1B virus )లక్షణాలు ఏంటని అడిగితే, అతను చెప్పే సమాధానాలు మరింత షాకింగ్‌గా ఉన్నాయి.“విరేచనాలు,” “ఒక రకమైన వాసన” అంటూ అసహ్యంగా మాట్లాడటమే కాకుండా, ఆ వైరస్ “భారతదేశం నుంచి వచ్చిందని” ఆరోపిస్తున్నాడు.చివర్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి “మ్యాన్ అప్” ( Man Up )అంటూ పిలుపునివ్వడం గమనార్హం.

ఈ వీడియో సోషల్ మీడియాలో దాదాపు ఒక మిలియన్ వ్యూస్‌తో దుమారం రేపుతోంది.నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు.కొందరు ఆ వ్యక్తికి మద్దతు తెలుపుతుంటే, మరికొందరు అతడిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.“నువ్వొక నీచుడివి.భారతీయులు చాలా కష్టపడి పనిచేసేవారు.వాళ్లు లేకపోతే అమెరికా ఉండేది కాదు.నా భార్య భారతీయురాలు.తను చాలా తెలివైనది, అందమైనది, కష్టపడి పనిచేసే వ్యక్తి” అంటూ ఒకరు ఘాటుగా స్పందించారు.

ఇంకొందరు మాత్రం ఆ వ్యక్తి చర్యను “హీరోయిజం” అంటూ పొగిడారు.అయితే, చాలా మంది మాత్రం అది అసభ్యకరమైన, అవమానకరమైన చర్య అని మండిపడుతున్నారు.ఒక యూజర్ అయితే “నీకు సమస్యలున్నాయి” అంటూ సూటిగా చెప్పేశాడు.నిజానికిది అమెరికాలో జరుగుతున్న ఒక పెద్ద సమస్యలో భాగం అని చెప్పొచ్చు.ముఖ్యంగా H1-B వీసాలు ( H1-B visas )కలిగి ఉన్న భారతీయ వలసదారుల పట్ల అక్కడి వారి అభిప్రాయం మారిపోతోంది.చాలా మంది అమెరికన్లు, ఈ వీసా హోల్డర్లు తమ ఉద్యోగాలను లాక్కుంటున్నారని విపరీతంగా నమ్మేస్తున్నారు.

అందుకే ఇలా భారతీయులపై వ్యతిరేకత, ద్వేషం పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube