టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood industry ) ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్( Actor Rajendra Prasad ) కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.ఎన్నో హిట్ సినిమాలలో నటించి విజయాలను సొంతం చేసుకున్న రాజేంద్ర ప్రసాద్ తనకు పద్మశ్రీ రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పుష్ప2 సినిమాలో హీరో రోల్ పై సోషల్ మీడియాలో నా వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన తెలిపారు.తాజాగా బన్నీని కలిసిన సమయంలో ఇదే విషయం గురించి మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చారు.
ఆన్ లైన్ లో వచ్చిన పోస్టులు చూసి నేను, బన్నీ నవ్వుకున్నామని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని నెగిటివ్ కోణంలో చూడకూడదని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలనే తెరపై ప్రతిబింబిస్తున్నామని ఆయన తెలిపారు. పద్మ అవార్డ్ ( Padma Award )రాకపోవడం గురించి కూడా రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా స్పందించారు.
జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఏమోనండి నాకు తెలియదని అన్నారు.కానీ ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పాలని అనుకుంటున్నానని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.పూజ్యులు, పెద్దలు రామోజీ రావు గారు దే విషయం గురించి గతంలో నాతో మాట్లాడారని ఆయన కామెంట్లు చేశారు.ప్రసాద్ నీకు పద్మ అవార్డ్ వచ్చిందా అని ఆయన అడగగా నేను లేదని బదులిచ్చానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఆ సమయంలో రామోజీ రావు గారు నువ్వు ఎప్పుడూ దానికి ప్రయత్నించవద్దని ఎందుకంటే పద్మశ్రీ ( Padma Shri )కంటే నువ్వు గొప్ప వ్యక్తివి అని ఆయన అన్నారని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.షష్టిపూర్తి అనే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ కామెంట్లు చేశారు.రాజేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాజేంద్ర ప్రసాద్ కు అన్యాయం జరిగిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.