నేడు స్మార్ట్ ఫోన్స్ వాడకం తప్పనిసరిగా మారడంతో సోషల్ మీడియా హవా ఆటోమేటిగ్గానే పెరిగిపోయింది.ఈ క్రమంలో ఎన్నో రకాల వీడియోలు ఇక్కడ నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి.
అందులో కొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటే, మరికొన్ని చాలా సీరియస్ గా అనిపిస్తూ ఉంటాయి.కొన్ని జుగుప్సగా అనిపిస్తే, ఇంకొన్ని చాలా దారుణమైనవిగా అనిపిస్తూ ఉంటాయి.
ఇటీవలి కాలంలో చూసుకుంటే వివాహ వేడుకలకు(wedding ceremonies) సంబందించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం గమనించవచ్చు.ఈ క్రమంలోనే ఒక వైరల్ వీడియో(viral video) జనాలకు బాగా కితకితలు పెడుతుంది.
అవును, జనాలు కొందరు కావాలని చేస్తారో మరి పబ్లిసిటీ కోసం చేస్తారో కానీ.కొన్ని పెళ్లిళ్లలోని దృశ్యాలు చాలా వైరల్ అవుతూ ఉంటాయి.పెళ్లిలో వధువు, వరుడు (Bride ,groom)వెరైటీగా ఎంట్రీలు కావచ్చు, పీటల మీద పెళ్లి ఆగిపోవడం కావచ్చు, సరిగ్గా పెళ్లి జరుగుతున్నపుడు మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు ఎంట్రీ ఇవ్వడం కావచ్చు… ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం.ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.
వేదిక మీద పెళ్లి తంతు జరుగుతుండగా… హోమం చుట్టూ కొత్త జంట ఏడడుగులు వేస్తున్నారు.వరుడి వెనుకాల వధువు నడుస్తూ ఉంటుంది.
ఇక్కడే జరిగింది అసలు తంతు.పెళ్లిలో వరుడు పట్టు పంచ కట్టుకున్నాడు.
వరుడు వేసుకున్న ధోతీ అంచు మీద వధువు కాలు పడడంతో అది వెంటనే జారీపోయింది.అయితే ఇక్కడ వరుడు వెంటనే తన ధోతీని వేసుకుని కవర్ చేసుకున్నాడు.
దీంతో అక్కడున్న వారంత ఒక్కసారిగా ఫన్నీగా నవ్వారు.
దీనికి సంబందించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక్కడి వీడియోలో వధువు కూడా.తన భర్తను చూసి ఫన్నీగా నవ్వడం మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు.
ఈ వీడియో ప్రస్తుతం వైరల్ కాగా దీన్ని చూసిన నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారంటే మీరు నమ్మాల్సిందే.మరికొందరు లోపల ఇన్నర్ ఉంది భయ్యా.లేకుంటే.ఏంజరిగేదో పాపం! అంటూ సెటైర్ లు కామెంట్స్ రూపంలో వేస్తున్నారు!
.